ఏపీకి అదనపు వనరులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఉన్న అధికారులంతా అమరావతి పరిస్థితులు తట్టుకోలేక పారిపోతున్న వేళ ఏపీకి అదనంగా ఐఏఎస్‌లను కేటాయించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ క్యాడర్‌లో ప్రస్తుతం 211 పోస్టులు ఉంటే., ఇటీవలి సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమీక్షలో 19 పోస్టులు మంజూరు చేసేందుకు అమోదం లభించింది. దీంతో ఏపీలో ఐఏఎస్‌ల సంఖ్య 230కు చేరనుంది. ఇందులో డైరెక్ట్‌ రిక్రూట్‌లో 160 పోస్టులు ఉంటే…, కన్ఫర్డ్‌ కోటాలో 70 పోస్టులు ఉన్నాయి. త్వరలో జరిగే కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయానికి అమోదం లభించనుంది. నిజానికి ఏపీలో 211 పోస్టులు ఉన్నా వాటిలో పనిచేస్తున్న వారి సంఖ‌్య 165 మాత్రమే….. 46మందికి పైగా ఐఏఎస్‌లు లేకపోవడంతో పాలన పడకేస్తోంది. అఖిల భారత సర్వీసు అధికారుల కొరతతో ఇన్‌ఛార్జిలతోనే నెగ్గుకొస్తున్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్‌లపై విభజన ఎఫెక్ట్‌ బాగా పడింది. సమర్ధులైన అధికారులు రాష్ట్రానికి లభించినా ఏపీలో పనిచేయడానికి వారు మొగ్గు చూపడం లేదు

సీనియర్లంతా హైదరాబాద్ లోనే…….

సీనియర్‌ అధికారులంతా హైదరాబాద్‌లో స్థిరపడిపోవడం., విజయవాడలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడకు రావడానికి మొగ్గు చూపట్లేదు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన గిరిధర్‌కు, కేంద్ర పెట్రోలియం శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. కేజీ బేసిన్‌ వ్యవహారాల్లో అంబానీలను ముప్పతిప్పలు పెట్టిన గిరిధర్‌లాంటి అధికారి ఏపీకి వచ్చిన ఏడాదిలోనే ఢిల్లీ తిరిగి వెళ్లిపోయారు. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ ఇక్కడ పనిచేయలేనంటూ వెళ్ళిపోయారు. ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా కూడా కేంద్ర సర్వీసుకు దరఖాస్తు చేసుకున్నారు. ఐఏఎస్‌ దంపతులు యువరాజ్‌-జానకీలు ఢిల్లీ వెళ్లిపోయారు. డిప్యూటేషన్‌లపై ఢిల్లీ వెళ్ళిన వారు అక్కడే ఉండిపోతున్నారు. అక్కడే ఉండేలా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. దీంతో ఏపీలో ఇన్‌ఛార్జిలతో నెట్టుకురావాల్సి వస్తోంది. చాలామంది అధికారులు ప్రభుత్వ తీరుతో సరిపడకపోవడం వల్ల కూడా కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌ వాతావరణానికి అలవాటు పడిన అధికారుల పిల్లలు ఇక్కడకు వచ్చేందుకు ససేమిరా అంటున్నారట. దీంతో కుటుంబాలు హైదరాబాద్‌లో., ఉద్యోగాలు ఇక్కడ చేయలేక ఢిల్లీ వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1