ఏపీపై దెబ్బకు దెబ్బ తీర్చుకున్న తెలంగాణ

తెలంగాణకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీ సర్కారు లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధమైంది. ఏపీ సర్కారే తమకు రూ.1676.46 కోట్లు బాకీ ఉందని., `తక్షణమే చెల్లించాలంటూ తెలంగాణ విద్యుత్‌ సంస్థల సిఎండీ ప్రభాకర్‌ రావు లేఖ రాశారు. వివిధ సంస్థల నుంచి తెలంగాణ జెన్‌కో తెచ్చుకున్న రుణాల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో తక్షణమే బాకీలు విడుదల చేయాలని కోరారు. రెండు రాష్ట్రాల మద్య విద్యుత్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు తాము ఎన్ని సార్లు లేఖలు రాసినా ఏపీ స్పందించలేదని తెలంగాణ ఆరోపిస్తోంది. మొత్తం మీద ఏపీకి కూడా విద్యుత్తు సరఫరా నిలిపేసినట్లు ప్రకటించిడంతో రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు యుద్ధం ప్రారంభమైందని చెప్పొచ్చు.

1 Comment on ఏపీపై దెబ్బకు దెబ్బ తీర్చుకున్న తెలంగాణ

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1