ఏపీలాంటి డ్రామానే తమిళనాడులో కూడానా?

తమిళనాడులోనూ ఏపీ లాంటి డ్రామానే జరుగుతున్నట్లుంది. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే నేతలు బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ కేంద్రానికి తొత్తుగా మారిందన్న విమర్శలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపులు ఒక్కటవ్వడానికి కూడా కారణం బీజేపీయేనన్నది అక్కడి రాజకీయ పార్టీల వర్గాల్లో బలంగా విన్పిస్తున్న అభిప్రాయం. అయితే జయలలిత ఆశయాలకు విరుద్ధంగా కేంద్రానికి అధికార పార్టీ నేతలు అడుగులకు మడుగులొత్తుతున్నారని ఇటు డీఎంకే, అటు టీటీవీ దినకరన్ లు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో….

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకుంటే పళనిసర్కార్ ఇబ్బంది పడుతుందన్నది వాస్తవం. ఇటీవల జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలే పళని వర్గాన్ని నవ్వుల పాలు జేసింది. అయితే దినకరన్ ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి అక్రమంగా గెలిచారని ఏలాగోలా సర్దిచెప్పుకున్నారు. ఇక స్థానికసంస్థల ఎన్నికల్లో కూడా ఓటమి పాలయింతే దినకరన్ మరింత రెచ్చిపోయే అవకాశముంది. ఇప్పటికే దినకరన్ రాష్ట్ర పర్యటనలో పళనిస్వామి సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

బీజేపీపై నిప్పులు చెరిగిన అన్నాడీఎంకే…..

ిఇటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే బీజేపీపై విరుచుకుపడింది. అసెంబ్లీలో జయలలిత నిలువెత్తు ఫొటోను అధికార అన్నాడీఎంకేను ఆవిష్కరించింది. అసెంబ్లీ హాలులో జయలలిత ఫొటో పెట్టడంపై విపక్ష డీఎంకే తప్పుపట్టింది. అవినీతి కేసుల్లో ఇరక్కున్న జయలలిత ఫొటో పెట్టడమేంటని ప్రశ్నించింది. దీనిపై డీఎంకే న్యాయస్ధానాన్ని కూడా ఆశ్రయించింది. ఆవిష్కరణ కార్యక్రమానికి టీటీవీ దినకరన్ కూడా హాజరుకాలేదు. అయితే బీజేపీ కూడా హాజరు కాకపోవడంపై అన్నాడీఎంకే నేతలు నిప్పులు చెరిగారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే నేత తంబిదురై బీజేపీ ఈ కార్యక్రమానికి రాకపోవడాన్ని తప్పుపట్టింది. మోడీ ప్రధాని అయినప్పుడు జయలలిత స్వయంగా అభినందించిన విషయాన్ని తంబిదురై గుర్తు చేశారు. అయితే బీజేపీపై అన్నాడీఎంకే నిప్పులు చెరగడాన్ని విపక్షాలు డ్రామాగా అభివర్ణిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీపై అధికార పార్టీ నేతలు విమర్శలకు దిగారని విపక్షాలు చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1