ఏపీలో ఆర్టీసీ హాస్పిటల్ రెడీ

రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆర్టీసీ కార్మికుల కోసం అధునాతన హాస్పిటల్ సిద్ధం అయ్యింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందడం ఇబ్బందికరంగా మారడంతో 12కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణం చేపట్టింది. విద్యాధరపురం లో ఉన్న ఆర్టీసీ స్థలంలో జీ ప్లస్ 1 భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. బుధవారం రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. 50 బెడ్ల ఆసుపత్రి సేవలకు సిద్ధం అయ్యింది. ఆర్టీసీ విభజన పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఏపీ ఉద్యోగులకు విజయవాడలోనే వైద్య సేవలు అందేలా నిర్మాణం చేపట్టారు. రికార్డ్ సమయంలో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం అయ్యింది. మరో మూడు అంతస్తులు దశల వారీగా నిర్మిస్తారు. ఆస్పత్రి నిర్మాణం పై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే 2016 ఏప్రిల్ లొనే ఆస్పత్రి ప్రారంభం కావాల్సి ఉన్నా విభజన పూర్తి కాకపోవడం తో ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఆస్పత్రి నిర్మాణం కోసం జీతాల్లో నెలకు 100 రూపాయల కట్ చేస్తున్నారని., పూర్తి స్థాయిలో సౌకర్యాలు కూడా కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*