ఏపీ…యూపీ…సేమ్ టు సేమ్

ఆంధ్రప్రదేశ్ కు, ఉత్తర ప్రదేశ్ కు పేరులో చివర మాత్రమే కాకుండా కొన్ని విషయాల్లో స్పష్టమైన పోలికలు కన్పిస్తున్నాయి. యూపీలో సమాజ్ వాదీ పార్టీది సైకిల్ గుర్తయితే…ఏపీలో తెలుగుదేశం పార్టీది అదే గుర్తు. ఎన్నికల గుర్తు ఒక్కటే కాదు. తెలుగుదేశం వ్యవస్థాపక అద్యక్షుడు నందమూరి తారక రామారావు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ లు కూడా ఒకే రీతి…ఒకే మనస్తత్వం ఉన్నావారేనని సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చారు. కుటుంబసభ్యులు కూడా మంత్రివర్గంలోనూ చేర్చుకుని వారికి ప్రధాన బాద్యతలను కట్టబెట్టారు. తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్ అయింది. అక్కడి నుంచి టీడీపీ సీన్ మారింది. లక్ష్మీపార్వతి చెప్పిందే వేదంగా మారడంతో టీడీపీలో గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక గ్రూపు లక్ష్మీపార్వతి, మరో గ్రూపు చంద్రబాబు. చివరకు చంద్రబాబు మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని…పార్టీని తాను హస్తగతం చేసుకున్నారు. ఇందుకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా చంద్రబాబు వెంటే నడిచారు.

రెండో భార్య వల్లనే…
ఇక ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే….ములాయంసింగ్ మొదటి భార్య కొడుకు అఖిలేష్. ప్రస్తుత యూపీ సీఎం. ఎన్టీఆర్ లాగానే ములాయం కూడా మొదటి భార్య మరణించిన తర్వాత పార్టీ కార్యకర్త సాధనాగుప్తాను రెండో వివాహం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా సమాజ్ వాదీ పార్టీలోని సంక్షోభానికి సాధనాగుప్తాయే కారణమంటున్నారు. తన కొడుకు ప్రతీక్, కోడలు అపర్ణను ములాయం రాజకీయ వారసులుగా చేయాలన్నది సాధన ఆకాంక్ష. అందుకోసం ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ మద్దతు తీసుకున్నారు. సవతి తల్లి వల్లనే పార్టీలో సంక్షోభం ఏర్పడిందని కొందరు అఖిలేష్ అనుచరులు ఇటీవల బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్టీఆర్ పక్కన కుటుంబ సభ్యులెవరూ లేరు. యూపీలో మాత్రం ములాయంకు సోదరుడి అండ లభించింది. ఏపీలో అల్లుడు…యూపీలో కొడుకు. అంతే తేడా….మిగిలినదంతా …సేమ్ టు సేమ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*