ఏపీ సర్కార్ పై జగన్ మరో ఉద్యమం

వైసీపీ అధినేత జగన్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతులకు అండగా నిలవబోతున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో జగన్ దీక్ష చేపట్టబోతున్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. మిర్చి, పసుపు, ఉల్లి ఇలా ఒకటేమిటి రైతులందరూ గిట్టుబాటు ధర ల్లేక అల్లాడి పోతున్నారు. ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం దిగిరావడం లేదు. కొందరు మిర్చి రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వ్యాపారులు అంతా ఒక్కటై ధరలను తగ్గిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

రైతుల పక్షాన…

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ గుంటూరులో రైతుల పక్షాన దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. గుంటూరులో మిర్చి రైతులు, కర్నూలులో ఉల్లి రైతులు, దుగ్గిరాల పసుపు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భావించిన జగన్ రెండు రోజులు దీక్ష చేయాలని నిర్ణయించారు. గుంటూరులోనే జగన్ దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని జగన్ ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1