ఓలప్పా…హిజ్రాల లీడర్ గా టీడీపీ నేత

విశాఖలో హిజ్రా అనుమానాస్పద మృతి వెనుక టీడీపీ నాయకుడి హస్తం ఉన్నట్లు తేలడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండేళ్ళ క్రితం జరిగిన అనూష అనే హిజ్రా హత్య వెనుక టీడీపీ వార్డు అధ్యక్షుడు నూరాడ ఎల్లాజీ పాత్ర ఉందని తేలడంతో పోలీసులు అరెస్ట్‌ చేయడంతో అతని బాగోతం బయటపడింది. దాదాపు పదేళ్లుగా విశాఖలోని హిజ్రాలకు నాయకుడిగా చలామణీ అవుతున్న ఎల్లాజీ అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ హిజ్రాలపై పెత్తనం చెలాయించేవాడు. మగవాళ్లకు చీరలు కట్టి దందాలు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ అర్బన్‌ టీడీపీ అధ్యక్షుడు., ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ ముఖ్య అనుచరుడిగా ఉన్న ఎల్లాజీ హిజ్రాల సంఘానికి అధ్యక్షుడిగా చలామణి అయ్యేవాడు. ఒక్కో హిజ్రా రోజుకు రూ.300 నుంచి వెయ్యి వరకు ఇవ్వాల్సిందేనని టార్గెట్లు పెట్టేవాడు. ఇవ్వని వారిపై వేధింపులకు పాల్పడే వాడు. యువకుల్ని మభ్యపెట్టి వారిని ఉచ్చులోకి దించేవాడు.

అనూష హత్య కేసులోనూ…..

ఎల్లాజీ బాధలు తట్టుకోలేక అనూష విజయవాడ పారిపోవడంతో ఆమెను వెదికి పట్టుకుని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ యువకుడు తనకు మత్తు మందులు ఇచ్చి చీరలు కట్టి హిజ్రాగా మార్చి ఫోటోలు భార్యకు పంపడంతో ఆమె తనను విడిచిపెట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాతకేసులు మొత్తం బయటకు తీయడంతో ఎల్లాజీ బాగోతం బయటపడింది. నిందితుడు టీడీపీ నేతల సహకారంతో కోట్లకు పడగలెత్తినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఎల్లాజీ అరెస్టుతో హిజ్రాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిజ్రాలు డిమాండ్‌ చేస్తుంటే లోకల్‌ ఎమ్మెల్యే మాత్రం అతడిని కాపాడే యత్నాల్లో ఉన్నాడట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1