కవితకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో జరిగిన జాతీయ మహిళా సదస్సుకు హాజరైన కవిత జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ నినాదం చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కవిత డిమాండ్ చేయడంపై పవన్ ట్వీట్లో ప్రశంసించారు.

రెండు తెలుగురాష్ట్రాలు తమ సమస్యల కోసం కలిసి పోరాడితే విజయం సాధించవచ్చని పవన్ ఆకాంక్షించారు. కవిత వ్యాఖ్యలను తాను సమర్ధిస్తున్నానని కలిసుంటే నిలబడగలమని, విడిపోతే పడిపోగలమని పవన్ తన ట్వీట్ లో తెలిపారు.

1 Comment on కవితకు ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

  1. మంచి సాంప్రదాయాన్ని నెలకొన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎం.పీ కవిత కి నిజంగానే ధన్యవాదాలు చెప్పి తీరవలసిందే. Hats off to you wholeheartedly. ఎందుకంటే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడం మరియూ జై ఆంధ్రప్రదేశ్ అని నినదించండం ఎంతో హర్షించదగ్గ విషయం, హర్షణీయం కూడాను. ఇలాగే ఎప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఐకమత్యంతో మరియూ ఎంతో సఖ్యతతో రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడతారని ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published.


*