కాంగ్రెస్ కు హార్థిక్ పటేల్ కొత్త మెలిక

పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేశారు. హార్థిక్ పటేల్ గత కొన్నేళ్లుగా పటేళ్ల రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన గుజరాత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు చేరువయ్యారు. కాంగ్రెస్ తమ డిమాండ్లను అంగీకరిస్తే తాము మద్దతిస్తామని స్పష్టం చేసింది. పటేళ్ల రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ లీగల్ సెల్ తో కమిటీ వేసింది. ఈ కమిటీ చేసిన సిఫార్సులకు హార్థిక్ పటేల్ ఒకే చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తామంటే మద్దతివ్వడానికి తాను రెడీ అన్నారు. అంతేకాదు బీజేపీ వ్యతిరేకంగా ఆయన అనేక బహిరంగసభలు, సమావేశాల్లో కూడా మాట్లాడారు. దీంతో కాంగ్రెస్ కు హార్థిక పటేల్ పూర్తి మద్దతిస్తారని భావించారు.

30 స్థానాలిస్తేనే మద్దతు…

అయితే కాంగ్రెస్ పార్టీకి హార్థిక్ పటేల్ కొత్త మెలిక పెట్టారు. పటేల్ సామాజిక వర్గానికి 30 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఈరోజు అర్థరాత్రి వరకూ కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చారు హార్థిక్ పటేల్. అయితే పటేల్ సామాజిక వర్గం ఉన్న ప్రాంతంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఎక్కువగా ఉన్నారు. వారిని కాదని హార్థిక్ చెప్పిన వారికి టిక్కెట్లు ఇస్తే అసంతృప్తులు చెలరేగే అవకాశముందని కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలయింది. మొత్తం 182 శాసనసభ నియోజకవర్గాలున్న గుజరాత్ శాసనసభలో 30 అసెంబ్లీ సీట్లు ఒక్క పటేల్ సామాజిక వర్గానికే కేటాయిస్తే మిగిలిన కులాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అయితే హార్థిక్ పటేల్ విధించిన డెడ్ లైన్ లోపు ఆయన్ను బుజ్జగించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ హార్థిక పటేల్ పెట్టిన మెలిక నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1