కేజ్రీ తన తప్పును అంగీకరించాడే…?

పార్టీలో పెరుగుతున్న అసమ్మతి, అధిష్టానంపై పెరుగుతున్న అసంతృప్తి కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎట్టకేలకు దిగివచ్చారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కొన్ని తప్పులు చేసిందని అంగీకరించారు. అయితే వాటిని సరిదిద్దుకుంటామని కేజ్రీవాల్ తెలిపారు. ఈ విషయాన్ని కేజ్రీ ట్వీట్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తర్వాత కేజ్రీవాల్ రెండు రోజులుగా తన అనుచరులతో, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. వారు జరిగిన విషయాలన్నింటినీ పూస గుచ్చినట్లు వివరించడంతో కేజ్రీ తాను చేసిన తప్పులను తెలుసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన నేతల ఒకరు చెప్పారు. పార్టీని తిరిగి సరైన పంథాలో నడిపేందుకు కేజ్రీవాల్ సిద్దమయ్యారు. పంజాబ్, గోవా ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో సయితం చావు దె్బ్బ తినింది.

అసంతృప్తి పెరిగినందునేనా?

దీంతో కేజ్రీవాల్ కు సొంత పార్టీ నుంచే నిరసనలు ఎదురయ్యాయి. ఈవీఎంలు పేరు చెప్పి మభ్య పెట్టవద్దని కూడా కొందరు సలహా ఇచ్చారు. అంతేకాకుండా పార్టీ నియంతలాగా నడపవద్దని కూడా మరికొందరు సూచించారు. కొందరు రాజీనామా చేసేశారు. దీంతో కేజ్రీవాల్ అసలు కారణాన్ని వెదికే పనిలో పడ్డారు. క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఆయన ఓపిగ్గా గంటల తరబడి మాట్లాడారు. రెండు రోజులు వాలంటీర్లు, ఓటర్లతోనే కేజ్రీవాల్ ఎక్కువ సేపు మాట్లాడారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార కార్యక్రమాల వరకూ పార్టీ చేసిన పొరపాట్లను వారు వివరించారు. దీంతో కేజ్రీవాల్ తప్పును అంగీకరించారు. తాను కొన్ని తప్పులు చేశానని, అయితే తెలియక చేసిన తప్పులేనని కేజ్రీవాల్ చెప్పొకొచ్చారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి ఆప్ సరైన దిశలో వెళుతుందని ఆయన ముఖ్య కార్యకర్తలకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*