కేసీఆర్‌కు క్యాస్ట్ సెగ తగులుతుందా?

kchandrasekharrao fire on congress party

రాజ‌కీయాల్లో త‌ల పండిన నేతలైనా, ఎత్తుల‌కు పైఎత్తులు వేసే నేత‌లైనా స‌రే ప్ర‌జాద‌ర‌ణ లేక‌పోతే.. ప‌నిఖాళీ! ముఖ్యంగా ఉద్య‌మాల నేప‌థ్యంలో రాష్ట్రానికి అధినేత అయిన కేసీఆర్ లాంటి వాళ్ల విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. ప్ర‌జాద‌ర‌ణ‌ను దారుణంగా కోల్పోతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప‌రిస్థితి త‌న‌కు రాకూడ‌ద‌ని కేసీఆర్ ప‌దే ప‌దే అనుకుంటున్నారు. నిన్న‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో కేసీఆర్‌కు తిరుగులేద‌ని అంద‌రూ అనుకుంటున్నా ఇప్పుడు చాప‌కింద నీరులా వ్య‌తిరేక‌త విస్త‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌పై గెలుపు మంత్రం ప‌ఠిస్తూనే.. ప్ర‌స్తుతం త‌న ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుని కారును ముందుకు న‌డిపిస్తున్నారు.

తెలంగాణలో కులాల కుంప‌ట్లు …

ప్ర‌స్తుతం తెలంగాణ‌ రాష్ట్రం మొత్తం కులాల కుంప‌ట్ల సెగ‌లో కాగుతోంది. ఏ కులానికి ఆకులం విడివిడిగా ఎన్నిక‌ల వైపు వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. మా కేంటి లాభం అనే యాంగిల్‌లోనే కులాల నేత‌లు, ప్ర‌జ‌లు సైతం రాజ‌కీయాల‌కు పాకులాడుతున్నారు. క్యాస్ట్ పాలిటిక్స్ తెలంగాణ‌లో చాలా చాలా త‌క్కువ. ఏపీలో రాజ‌కీయాల‌న్నీ క్యాస్ట్‌ల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే తెలంగాణ‌లో గ‌త యేడాదిగా క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువైపోయాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని చాలా మంది ఇత‌ర పార్టీల్లోని రెడ్డి సామాజిక‌వ‌ర్గం నేత‌లు కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా మార్చేశార‌ట‌. అంటే.. ఇప్పుడు రెడ్డి సామాజిక వ‌ర్గంలో కేసీఆర్ అంటే.. ఇప్పుడో విలన్ అనే రేంజ్‌లో ఉంద‌న్న గుస‌గుసు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో వారంతా కేసీఆర్‌పై పోరుకు సిద్ధ‌మ‌య్యారు. అంటే … వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఈ విష‌యం తెలిసిన కేసీఆర్ ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని సాగ‌దీసి ప్ర‌యోజ‌నం లేద‌నుకున్నార‌ట‌. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను అంటీ ముట్ట‌న‌ట్టున్న క‌మ్మ వ‌ర్గాన్ని, త‌న‌తో త‌డిపొడి ట‌చ్‌లా ఉన్న బీసీని పూర్తిగా త‌న‌వైపు తిప్పుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. నిన్న‌టికి నిన్న రెడ్డి సామజిక వర్గం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. రెడ్డి పోరు యాత్ర పేరుతో కేసీఆర్‌కు షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు రెడ్లు. అకస్మాత్తుగా తెలంగాణాలో జరుగుతున్నఈ పోరుపై కేసీఆర్ క‌న్నేశారు.

కాంగ్రెస్‌కు ఇలా షాక్….

కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే ఈ ఉద్యమం తెరపైకి వచ్చిందని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో రెడ్ల‌కు షాకిచ్చేలా.. వెలమ, కమ్మ సామజిక వర్గాలని కలుపుకుని టిఆర్ఎస్ ని తిరుగులేని శక్తిగా చేసేందుకు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చ‌క‌చ‌కా పావులు కదుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న వైరి పార్టీ టీడీపీతో సైతం పొత్తుకు సిద్ధ‌మ‌య్యారు. అలా చేయ‌డం వ‌ల్ల రాష్ట్రంలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న క‌మ్మ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు కేసీఆర్ వ్యూహం సిద్ధం చేస్తున్నార‌ని మేట‌ర్‌. టీడీపీ గ‌తంలో తెలంగాణ‌లో బీసీ ఫార్ములా బాగా ఫాలో అయ్యేది. ఇక గతంలో వెల‌మ వ‌ర్గం నుంచి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన జ‌ల‌గం వెంగ‌ళ‌రావు కూడా రెడ్ల‌ను ఎదుర్కొనేందుకు క‌మ్మ‌ల‌కు బాగా ప్ర‌యారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు కేసీఆర్ వెంగ‌ళ‌రావు ఫార్ములా + టీడీపీ ఫార్ములా అయిన బీసీ ఫార్ములాను క‌లిపేసి రెడ్ల‌కు ఎదుర్కొనేందుకు ప్లాన్లు వేస్తున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. మొత్తానికి వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో కేసీఆర్ కారు ఎంత జోరందుకుంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*