కేసీఆర్ నియోజకవర్గంలో టీడీపీ ఏం చేయబోతోంది?

టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి టీటీడీపీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. వరుసగా క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించింది. ప్రజా వ్యతిరేక విధానలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని నిశ్చయించింది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లానే తొలుత ఎంచుకుంది. టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు.

కేసీఆర్ ను టార్గెట్ చేయాలంటే తొలుత ఆయన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లోనే భారీ బహిరంగ సభను నిర్వహించాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు. టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యర్ధి తామేనంటూ జనంలోకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గాలుగా విడిపోవడం తమకు లాభిస్తోందని టీటీడీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని కూడా నిర్ణయించింది. ఏపీలో బీజేపీకి సత్సంబంధాలున్నా….తెలంగాణలో మాత్రం బీజేపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మతపరమైన ముద్ర పడకుండా తెలంగాణలో లబ్దిపొందాలంటే కమలనాధులకు దూరంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చింది. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటుగా తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై పెద్ద యెత్తున ఉద్యమం చేపట్టాలని భావిస్తోంది. గ్రామ, మండల, నియోజకవర్గాల కమిటీలను నిర్మించాలని అభిప్రాయపడింది. కేసీఆర్ చేసిన వాగ్దానాలను అమలు కోసం వరుస ఉద్యమాలకు దిగాలని భావించింది. విద్యార్ధి సమస్యలపై కూడా పోరాటం ఉధ‌ృతం చేయాలని నిర్ణయించుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*