కేసీఆర్ మాస్టర్ బ్రెయిన్ అంటే… అదే మరి…!

రాజ‌కీయాల్లో ఎలా చ‌క్రం తిప్పాలో కేసీఆర్‌కు తెలిసినంత‌గా తెలంగాణ‌లో ఎవ‌రికీ తెలియ‌ద‌ని అంటారు. ఉద్య‌మ స‌మ‌యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా రాష్ట్రంలో ఆయ‌న‌దే పై చేయిగా నిలిచింది. కాంగ్రెస్ కురువృద్ధులు, మేధావుల‌ను సైతం డింకీలు కొట్టించ‌డంలో కేసీఆర్ నాలుగు ఆకులు ఎక్కువే చ‌దువుకున్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న హ‌వా చూపించాల‌ని, ప్ర‌జ‌ల్లో త‌న‌కు వ్య‌తిరేక‌త లేద‌ని నిరూపించుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న‌కేసీఆర్‌..త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న వారిపై ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసేశారు. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే.. తాను నాలుగు మెట్లు కింద‌కి దిగేందుకు కూడా వెనుకాడ‌డం లేదు. తాజా ప‌రిణామాలు కేసీఆర్‌లోని వ్యూహాన్ని వెల్ల‌డిస్తున్నాయి. రాష్ట్రంలో ఆయ‌న ఇటీవ‌ల తాజా తాయిలం ప్ర‌క‌టించారు.

రైతాంగానికి ఆకట్టుకోవడానికి….

ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను కూక‌టి వేళ్ల‌తో పెక‌లించేందుకు ప్లాన్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా 24 గంట‌ల విద్యుత్‌కు శ్రీకారం చుట్టారు. అయితే, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌లో రైతుల‌కు జ‌రిగిన ఘోర ప‌రాభ‌వాన్ని ప్ర‌తి ప‌క్షాలు ఇప్ప‌టికీ విడిచి పెట్ట‌డం లేదు. దీనిని రాజ‌కీయంగా మ‌లుచుకుని కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు సంధించారు. ఇక‌, ఇప్పుడు గ‌త కొన్నాళ్లుగా కేసీఆర్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు కోదండ‌రాం. ఈ క్ర‌మంలో ఆయ‌న తాజాగా ప్ర‌తిపాదించిన 24 గంట‌ల విద్యుత్‌పైనా విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. దీనికి సంబంధించి ఓ ప్రెస్‌నోట్ కూడా విడుద‌ల‌చేశారు. అయితే, దీనివ‌ల్ల త‌న‌కు డ్యామేజీ త‌ప్ప‌ద‌ని అనుకున్న కేసీఆర్ ఎవ‌రిని రంగంలోకి దింపితే.. దీని నుంచి బ‌య‌ట ప‌డ‌డ‌మే కాకుండా, కోదండ‌రాం ఉనికి కూడా లేకుండా చేయొచ్చో ప‌క్కా ప్లాన్ చేసుకున్నారు.

పవన్ ను రంగంలోకి దింపారా?

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ను ఆశ్ర‌యించారు. త‌న అనుచ‌రుల ద్వారా ప‌క్కాగా స్కెచ్‌ను అమ‌లు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఇన్విటేషన్ పంపినప్పటికీ.. అప్పుడు హాజరు కాని పవన్.. తాజాగా జనవరి ఒకటో తేదీన అకస్మాత్తుగా కేసీఆర్ ను క‌లుసుకున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లి దాదాపు పావుగంట‌కు పైగా వెయిట్ చేసి మ‌రీ కేసీఆర్‌ను క‌లిసి విషెస్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారమైతే.. పవన్ తో భేటీ అన్నది కేసీఆర్ షెడ్యూల్ లో లేదు. కానీ, కోదండ రాం ఎఫెక్ట్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు అప్ప‌టి క‌ప్పుడు ప‌వ‌న్‌ను రంగంలోకి దింపేశారు.

డైవర్ట్ చేయడానికే….

సీఎంకు విషెస్ చెప్పే ఆలోచనను.. ఆయనకు వచ్చేలా కామన్ ఫ్రెండ్స్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. వారి సాయంతో పవన్ వచ్చేలా చేశారు. పవన్ రాకతో విషయం పూర్తిగా డైవర్ట్ కావటంతో పాటు.. కోదండం సారు ప్రిపేర్ చేసి పంపిన ప్రెస్ నోట్ ఏ మీడియాలోనూ హైలెట్ కాకుండా కేసీఆర్ వేసిన ప్లాన్ స‌క్సెస్ అయింది. అంతేనా, కేసీఆర్ పాల‌న భేష్ అంటూ ప‌వ‌న్ వ్యాఖ్యానించే స‌రికి.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న కేసీఆర్‌పై అపోహ‌లు ప‌టాపంచ‌లైపోయాయి. సో.. ఇదీ.. కేసీఆర్‌.. ప్లాన్‌! కోదంరాంకి దీంతో దిమ్మ‌తిరిగిపోయింద‌ని అంటున్నారు టీఆర్ ఎస్ వ‌ర్గాలు. మ‌రి మాస్టారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*