గాలి దేశం నుంచి జంప్ అయ్యారా…?

మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కోసం పోలీసులు ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నటి నుంచి ప్రత్యేక బృందాలు గాలి కోసం గాలిస్తున్నా ఫలితం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో కుటుంబ సభ్యులను, సన్నిహితులను అడిగినా ప్రయోజనం లేకపోయింది. గాలి ఫోన్ తో పాటు, ఆయన పీఏ అలీఖాన్ ల ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయి. గాలి దేశం విడిచి వెళ్లే అవకాశముందని భావించిన పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

జాడ తెలియక….

అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో గాలి జనార్థన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. బెయిల్ మీద గాలి బయట ఉన్నారు. అయితే అంబిడెంట్ కంపెనీ పై ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు జరగకుండా గాలి డీల్ కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా ఈడీ అధికారి ఒకరికి లంచం ఇవ్వడమే కాకుండా, తాను ఆ కంపెనీ నుంచి పెద్దయెత్తు ముడుపులు అందుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కర్ణాటక స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ ప్రారంభించి గాలి జనార్థన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. అయినా ఇంతవరకూ ఆయన జాడ కానరాలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*