గులాబీ ఎమ్మెల్యే ధైర్యం చూశారా?

ఎప్పుడూ ఏదో వివాదాలతో వార్తల్లో ఉండే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకున్నాడు. తనకు అనుకూలంగా పని చేయలేదనే ఆగ్రహ౦తో ఓ సీనియర్ అధికారిపై నోరుపారేసుకున్నాడు.ఆంద్రా అధికారివంటూ బండ బూతులు తిట్టాడు.సోమవారం నాటికి నేనడిగిన పని చేయకుంటే అంతు చూస్తానంటూ బెదిరించ సాగాడు.అంతటితో ఆగని సదరు సారు తోటి నేత పై కూడా తిట్ల దండకం మొదలెట్టాడు.అయితే ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదంతా ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోనే…..ఆయన ఎవరో కాదు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. అయితే ఆ ఎమ్మెల్యేకు ఇదంతా కొత్తేమీ కాదు.గతంలో ఓ కాలేజి యజమానిని చంపుతానని బెదిరించిన వాయిస్, పోలీస్ స్టేషన్ లో ఈయన సతీమణి ఏపూరు సోమన్నకు బీడీలు వేయించిన నిర్వాకం ఇవన్నీ సోషల్ మీడియా లో వైరల్ అయినవే. తాజాగా ఈ ఆడియో కూడా వైరల్ అవుతుండడం ఇప్పుడు నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

నిబంధనల ప్రకారం చేస్తానని చెప్పడంతో…

తన అనుచరులకు సంబంధించిన ఓ పనిని నల్గొండ డీసీసీబీ సీఈవోకు అప్పగించాడు ఎమ్మెల్యే. వారం రోజుల్లో పని పూర్తి చేయాలని హుకుం జారీచేశాడు.ఆ అధికారి నిబంధనల ప్రకారం చేస్తానని కొంచెం టైం పడుతోందని చెప్పడం తో వీరేశం ఆవేశంతో రగిలిపోయాడు.తన మాటకే ఎదురు చెబుతావా అంటూ నోటికి పని చెప్పాడు.పని కోసం10 లక్షలు డిమాండ్ చేస్తున్నావని నీ పై అధికారులకు పిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. మరి వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ఆవేశ వీరేశం పై అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి మరీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1