గ్యాంగ్ మూవీ రివ్యూ

విడుదల తేదీ : 12 జనవరి 2018
నటీనటులు : సూర్య, కీర్తి సురేష్, రమ్య కృష్ణ, ఆర్.జె.బాలాజీ, సెంథిల్, బ్రహ్మానందం తదితరులు
సంగీతం : అనిరుద్ రవిచంద్రన్
ఛాయాగ్రహణం : దినేష్ కృష్ణన్
కూర్పు: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత : కే.ఈ.జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం : విగ్నేష్ శివన్

తెలుగు రాష్ట్రాలలో తమిళనాడు మార్కెట్ కి సమాంతర మార్కెట్ ఏర్పరచుకున్న హీరో సూర్య వరుస వైఫల్యాలతో కోల్పోయిన మార్కెట్ ని తిరిగి ఏర్పరచుకోవటానికి తన కథల ఎంపిక పై నమ్మకం పక్కనపెట్టి స్పెషల్ చబ్బీస్ అనే చిత్ర రీమేక్ గా ఈ కథ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్న చిత్రం గ్యాంగ్. హీరోయిన్ కీర్తి సురేష్ సంక్రాంతి సందర్భముగా వచ్చిన చిత్రాలలో రెండు చిత్రాలలో కీలక హీరోయిన్ గా నటించగా అజ్ఞ్యాతవాసి నిరాశ పరిచిన తరువాత ఈ మహానటి పాత్రధారి నటన పై అంచనా వేయటానికి ఎదురు చూస్తున్న చిత్రం కూడా ఇదే. హాలీవుడ్ మరియు ఉత్తరాది భారత దేశ ప్రేక్షకులని ఆకట్టుకున్న కథ ని దక్షిణాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గ విధంగా దర్శకుడు విగ్నేష్ శివన్ ఎలా రూపొందిస్తాడా అనే ఉత్కంఠ స్పెషల్ చబ్బీస్ అభిమానులందరిలోను వుంది. సూర్య ఆశ నెరవేర్చటానికి, స్పెషల్ చబ్బీస్ అభిమానుల అంచనాలు అందుకోవటానికి దర్శకుడు ఈ చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దాడో పూర్తి విశ్లేషణలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :
బరంపుత్ర బద్రీనాథ్(ఆర్.జె.బాలాజీ) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉద్యోగానికి జరుగుతున్న ఇంటర్వ్యూ కి హాజరై ఆ పోస్ట్ కి అన్ని విధాలా సమర్థుడైనప్పటికీ తనకి వున్నా అతి వాగుడు పై కంట్రోల్ లేక ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతాడు. మరో వైపు గంగాధర్ తిలక్(సూర్య) సి.బి.ఐ డిపార్ట్మెంట్ లో, అతని స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ గా మాత్రమే ఉద్యోగాలు చేయాలని కసిగా ప్రయత్నాలు చేస్తుంటారు. సి.బి.ఐ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్లిన తిలక్ ని పై అధికారి (సురేష్ చంద్ర మీనన్) తన వద్ద పని చేసే క్లర్క్ కొడుకు అనే కారణంతో ఆ ఉద్యోగం తిలక్ కి రాకుండా ఆపుతాడు. అయినప్పటికీ బుజ్జమ్మ(రమ్య కృష్ణ), సెంథిల్, సత్యం, శివ సంఖర్ ,మాస్టర్ ల బృందంతో కలిసి ఓపిక మన్త్రి ఇంటి పై సి.బి.ఐ దాడులు నిర్వహిస్తారు. అక్కడ టి.వి.ఛానల్ రిపోర్టర్ గా తిలక్ కి పరిచయమైన కీర్తి సురేష్ అక్కడ ఎందుకు వుంది? ఉద్యోగం దక్కని తిలక్ సి.బి.ఐ ఆఫీసర్ గా సొంత టీం ని ఏర్పాటు చేసుకోవటం, వి.ఐ.పి ల నివాసాలపై దాడులు జరపటం ఎలా తటస్థించింది, ఈ చర్యల వెనుక ఈ బృందం వ్యూహం ఏమిటి అనేది మిగతా కథ.

నటీనటులు :
కథానాయకుడు సూర్య సి.బి.ఐ.ఆఫీసర్ అవ్వాలని కాలేకపోయి తన మిత్రుడిని కోల్పోయి దొంగ మార్గాన సి.బి.ఐ ఆఫీసర్ గా తన సొంత టీం ని లీడ్ చేసే పాత్రలో ముల్టీపుల్ వేరియేషన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రేక్షకుడికి అతడు నిజమైన సి.బి.ఐ అధికారి కాదని తెలిసిన తరువాత ఆయన బృందంతో వచ్చే సన్నివేశాలు హాస్యం సృష్టించలేకపోయినప్పటికీ ప్రేక్షకుడికి విసుగు తెప్పించకుండా ప్రథమార్ధం సాగటంలో సూర్య, రమ్య కృష్ణ, సెంథిల్, శివ శంకర్ ల నటన బాగా సహకరించింది. వీరి తో చేతులు కలిపి ఇతరులకి సహాయపడే పాత్రలో కీర్తి సురేష్ పరిమితి మేర బాగానే నటించింది కానీ ప్రతిభ కనపరిచే స్కోప్ లేని పాత్రగానే చిత్రంలో కథానాయిక పాత్ర మిగిలిపోయింది. సీనియర్ కమెడియన్ సుధాకర్ కొన్ని ఫ్రేమ్ లలో డైలాగ్ లేని పాత్రలో రమ్య కృష్ణ భర్త గా కనిపించారు. కేవలం ఒకే ఒక్క సన్నివేశం లో కనిపించే బ్రహ్మానందం ఆ ఒక్క సీన్ లో కూడా నవ్వించలేకపోయాడు. సీనియర్ హీరో కార్తీక్ సి.బి.ఐ అధికారిగా, ఆర్.జె.బాలాజీ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే నిజాయితీ వ్యక్తిగా మంచి నటనని కనపరిచారు.

విశ్లేషణ :
గ్యాంగ్ చిత్రానికి మూల కథ నీరజ్ పాండే(స్పెషల్ చబ్బీస్ కథా రచయిత, గ్యాంగ్ ఒరిజినల్ వెర్షన్) రచించినది అయినప్పటికీ ఆ కథని మన ప్రేక్షకులకి రుచించే విధంగా కథనం నడపటం కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. తెలుగు, తమిళ భాషలలో ఇప్పటికే నల్ల ధనం వెలికి తీయటం, లంచగొండితనం పై పోరాటం వంటి కథలు ఎన్నో ప్రేక్షకులు చూసేయటంతో మరొక సారి ఇలాంటి కథే చెప్తున్నప్పుడు బలమైన కథనం చాలా అవసరం. స్క్రీన్ ప్లే రచయిత, దర్శకుడు ఐన విగ్నేష్ శివన్ కథ చెప్పటం ప్రారంభించినప్పటి నుంచి రేసీ స్క్రీన్ ప్లే తో ప్రథమార్ధం ముగించేసినప్పటికీ ప్రథమార్ధం లో కొత్తదనం అయితే ఎక్కడా కనిపించదు. సూర్య, కీర్తి సురేషుల మధ్య సాగే అంతర్లీన లవ్ ట్రాక్ అర్ధాంతరంగా ముగించేశారు. ద్వితీయార్ధం ప్రారంభం ఐన తొలి ఫ్రేమ్ నుంచి కూడా తదుపరి సన్నివేశాన్ని సగటు ప్రేక్షకుడు ఊహించేసే విధంగా పట్టు లేని కథనంతో కథ చెప్పే ప్రయత్నం చేశారు విగ్నేష్ శివన్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ల వరకు వచ్చే సరికి ఆ ప్రెడిక్టబిలిటీ మరీ ఎక్కువ అయిపోతుంది. ఇలాంటి పేలవమైన స్క్రీన్ ప్లే తో ద్వితీయార్ధం నడపటం చిత్రానికి ప్రధాన బలహీనతగా నిలుస్తోంది. మేకింగ్ పరం గా తీసుకోవలసిన చిన్న చిన్న జాగ్రత్తలని మిస్ చేసి ప్రేక్షకులకి దొరికిపోయారు విగ్నేష్. ఈ చిత్ర కథ 1980 ల నేపథ్యంలో జరిగే కథ అయినప్పటికీ అప్పటి రోజులలో కథ జరుగుతుంది అనే భావన ప్రేక్షకుడికి కలుగజేయటంలో ఆర్ట్ విభాగం విఫలమయ్యింది. దినేష్ కృష్ణన్ తన కెమెరా పనితనంతో మెప్పించగా, అనిరుద్ అందించిన పాటలతో పాటు నేపధ్య సంగీతం సినిమాకి కొంత ఊరట గా అనిపిస్తుంది. అయితే పాటల ప్లేసెమెంట్ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కథకి అనుగుణంగా వుంటూ పరువలేధనిపించింది.

ప్లస్ పాయింట్స్: సూర్య, రమ్య కృష్ణ, ఆర్.జె.బాలాజీ, ఛాయాగ్రహణం, నేపధ్య సంగీతం, ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్: ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్, దర్శకత్వం, పాత్రల రూపకల్పన

రేటింగ్: 2.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1