ఘాజి మూవీ రివ్యూ ( రేటింగ్: 3 .0 /5 )

న‌టీన‌టులు: రానా ద‌గ్గుబాటి, తాప్సీ, నాజ‌ర్‌, ఓంపురి

సంగీతం: కె

నిర్మాత‌లు: పివిపి

ద‌ర్శ‌క‌త్వం: సంక‌ల్ప్

దగ్గుబాటి రానా ‘లీడర్’ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక హీరోగా రానా మరికొన్ని చిత్రాలు చేసినప్పటికీ అతనికి అనుకున్నంత పేరు రాలేదు. అయితే ‘బాహుబలి’తో భల్లాల దేవగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. తన పేరు అందరికి తెలిసేలా రానా తన నటనతో అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఒక కొత్త కథతో ‘ఘాజి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో తాప్సి ఒక ప్రధానపాత్రలో నటించింది. ఇప్పటివరకు ఇలాంటి డిఫరెంట్ స్టోరీ తో నాగార్జున ‘గగనం’ వంటి చిత్రంలో కనబడ్డాడు. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా మంచి పేరైతే తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు రానా కూడా అలాంటి ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతూ… తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ అందరిలో హైప్ క్రియేట్ చేయాడు. 70 ల్లో భారత్ – పాకిస్తాన్ కు మధ్యజరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ ‘ఘాజి’ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం ఆకట్టుకుంటుందో సమీక్షలో తెలుసుకుందా.

కథ: ఎప్పుడూ పాకిస్తాన్, భారత్ పై తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతుంటుంది. ఎలాగైనా భారత్ ని మట్టుబెట్టాలని చూస్తుంటుంది. పశ్చిమ పాకిస్తాన్ కి, తూర్పు పాకిస్తాన్ కి మధ్యన యుద్ధం జరుగుతుంటుంది. అయితే పశ్చిమ పాకిస్తాన్లో యుద్ధంలో పాల్గొంటున్న సైనికులకు సహాయం చేసేందుకు కరాచీ నుండి ఘాజి అనే సుబ మెరైన్ ని పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ఘాజి ఇండియా సముద్ర మార్గం నుండి ప్రయాణించవలసి ఉంటుంది. సముద్రం మధ్యలో ఇండియాకి చెందిన ఎస్సెస్ విక్రాంత్ యుద్ధ నౌకొకటి కాపలా ఉంటుంది. ఆ నౌకాని పేల్చేసి ఘాజి తన గమ్యం చేరాలనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న భారత్ తమ కమాండోలను రంగంలోకి దించుతుంది . వారిలో అర్జున్ వర్మ( రానా) రణ్వీర్ సింగ్ ( కె కె మీనన్) లు వుంటారు. వీరంతా ఘాజి పై యుద్ధం చేస్తారు. మరి ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు? అర్జున్ వర్మ తన టీమ్ తో ఘాజీపై గెలిచాడా? ఇవన్నీ తెలియాలంటే తెర మీద ఘాజీని వీక్షించాల్సిందే..

నటీనటులు: రానా అర్జున్ వర్మ పాత్రలో చక్కటి నటన ప్రదర్శించాడు. అసలు రానా ఇలాంటి పాత్ర చేయగలడా అని అనుకున్నవాళ్ళ నోరుమూసుకునేలా చేసాడు. అంతటి హావభావాలను పలికించాడు. పవర్ ఫుల్ రోల్ లో పవర్ ఫుల్ గా నటించి మెప్పించాడు. రానా ఈ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలుస్తాడు. కెకె మీనన్ కూడా డైలాగ్స్, నటనతో చక్కటి నటన కనబర్చాడు. ఓం పూరి, నాజర్ లు నటనతో మెప్పించారు. ఇక తాప్సి కి అందరూ ఎక్సపెక్ట్ చేసిన రోల్ దక్కకలేదు. పేద ప్రాముఖ్యత లేని పాత్రలో తాప్సి కనబడింది. ఇక ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్ చిరంజీవి వాయిస్ ఓవర్. సినిమా ని ఎక్కడికో తీసుకెళ్లడానికి చిరు వాయిస్ ఓవర్ ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.

సాంకేతిక వర్గం: దర్శకుడు సంకల్ప్ సినిమాని ఎలా ప్రెజెంట్ చెయ్యాలనుకున్నాడో అలాగే తెరకెక్కించాడు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తీసి మెప్పించాడు. ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ సినిమా తీయాలనుకుని పెద్ద సాహసమే చేసాడు. ఒక యుద్ధ నేపధ్య కథతో సినిమాని తెరకెక్కించాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక ఈ సినిమాకి మరో బలమైన పాత్ర బ్యాగ్రౌండ్ స్కోర్ ది. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ చాలాబావుంది. మంచి నిర్మాణ విలువలు ఈ చిత్రంలోకనబడ్డాయి.

ప్లస్ పాయింట్స్: కథ, దర్శకత్వం, రానా, చిరు వాయిస్ ఓవర్, క్లైమాక్స్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: కామెడీ, కమర్షియల్ ఎలెవెంట్స్ లేకపోవడం

రేటింగ్: 3 .0 /5