చంద్రబాబు సాహసించలేకపోతున్నారా?

టీటీడీ ఛైర్మన్ పదవిపై చంద్రబాబు ఇంకా ఒక క్లారిటీకి రాలేనట్లుంది. గత కొన్ని నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ప్రభుత్వం నియమించలేదు. అదిగో… ఇదిగో.. వారు.. వీరు.. అంటూ ఫిల్లర్లు వదులుతున్నారు తప్ప పాలకమండలి నియామకాన్ని చంద్రబాబు చేపట్ట లేకపోతున్నారు. గతంలో నెల్లూరు జిల్లా బీద మస్తాన్ రావుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారని వార్తలొచ్చాయి. అయితే కొంతకాలం క్రితం పుట్టా సుధాకర్ యాదవ్ కు టీటీడీ ఛైర్మన్ పదవి ఖరారయిందని సీఎంవో కార్యాలయమే లీకులిచ్చింది. దీంతో పుట్టా సుధాకర్ యాదవ్ కు ఛైర్మన్ పదవి ఇచ్చేశారనుకున్నారంతా. కాని పుట్టా సుధాకర్ యాదవ్ కు ఛైర్మన్ పదవి దక్కలేదు. ఆయన టీటీడీ సభ్యుడిగా ఉంటూ ఇతర మతాలకు చెందిన ప్రార్థనాలయాలకు, కార్యక్రమాలకు వెళ్లారని వివాదం చెలరేగింది.

పారిశ్రామిక వేత్తకే ఇస్తారా?

మరోవైపు పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ ఛైర్మన్ గా ఎంపిక చేసి మైదుకూరు టిక్కెట్ ను వచ్చే ఎన్నికల్లో డీఎల్ రవీంద్రారెడ్డి కి ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చినా తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల్సిందేనని, మూడున్నరేళ్లుగా తాను నియోజకవర్గంలో కష్టపడి తిరుగుతున్నానని పుట్టా గట్టిగా వాదించడంతో ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పారిశ్రామిక వేత్త పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వబోమని చంద్రబాబు చెప్పడంతో పారిశ్రామిక వేత్తకే టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారన్న వార్తలు తాజాగా వస్తున్నాయి. అయితే ఢిల్లీ స్థాయి నుంచి కూడా ఈ పదవి కోసం తీవ్రస్థాయిలో వత్తిడులు రావడంతోనే చంద్రబాబు ఈ పదవి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1