చిన్నమ్మకు చెన్నై మే సవాల్ అంటున్న పన్నీర్

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడు పెంచారు. తన స్వరాన్నీ పెంచారు. జయలలిత మేనకోడలు దీప సహకారంతో తాను ముందుకు సాగుతానని ప్రకటించారు. శశికళకు ఒకరకంగా సవాల్ విసిరినట్లయింది పన్నీర్. పార్టీని కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనేక అనుమానాలున్నాయని, ఆసుపత్రిలో జయ వద్దకు తనను కూడా రానివ్వ లేదని చెప్పారు. అందుకోసం జయ మృతిపై విచారణ జరగాల్సిందేనని పన్నీర్ స్పష్టం చేశారు. సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిపై విచారణ జరిపిస్తామన్నారు. జయలలితకు జరిగిన చికిత్స వివరాలన్నింటినీ బయట పెడతామన్నారు.

శశికళకు అంత సీన్ లేదు…

అయితే శశికళ తనను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించడంపై కూడా పన్నీర్ స్పందించారు. శశికళ కేవలం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జయలలిత ఆశయాలను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పన్నీర్ తెలిపారు. పార్టీకి విధేయుడు గానే ఉన్నానని తెలిపారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టేందుకు ఎందుకు తొందరపడ్డారో శశికళే సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ నా బలాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. తన వెనక బీజేపీ ఉందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. నాపై కావాలని కొందరు వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. మొత్తం మీద పన్నీర్ కు తమిళనాడులో మద్దతు పెరుగుతూ వస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*