జంబలకిడిపంబ మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, సిద్ది ఇద్నాని, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుధా, సత్యం రాజేష్
రైటర్స్: శ్రీనివాస్ ఆంకాలపు, జె.బి. మురళి కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
నిర్మాత: జోస్
డైరెక్టర్: జెబి మురళి కృష్ణ

గతంలో కామెడీ డైరెక్టర్ ఈ.వి.వి సత్యన్నారాయణ హీరో నరేష్, ఆమని ల జంటతో… బ్రహ్మానందం, అలీ వంటి కమేడియన్స్ తో జంబలకడిపంబ సినిమాని ఎంతో హాస్యాస్పదంగా అందరూ ఇష్టపడేలా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమాలో అమ్మాయిలు అబ్బాయిలుగా… అబ్బాయిలు అమ్మాయిలుగా.. పెద్దలు పిల్లలుగా, పిల్లలు పెద్దవాళ్ళగా మారితే కలిగే పరిణామాలను కామెడీతో కూడిన కథతో తెరకెక్కించాడు. మరి అప్పట్లో ఆ సినిమా హిట్ అయినా… ఇప్పటికి బుల్లితెర మీద ఆ సినిమా వస్తుంది అంటే… అందరిలో ఇంట్రెస్ట్… కారణం కేవలం కామెడీనే. మరి అప్పటి ఈ వి వి గారి టైటిల్ తో ఇప్పుడు ఈ జెనరేషన్ లో శ్రీనివాస్ రెడ్డి – సిద్ది ఇద్నాని జంటగా జెబి మురళి కృష్ణ ఈ జంబలకడిపంబ ని తెరకెక్కించాడు. నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కామెడీ ఎంతుంది? అసలు ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించారు? అప్పటి జంబలకడిపంబ కి ఇప్పటి జంబలకడిపంబ కి ఉన్న సిమిలారిటీస్ ఏంటి? గతంలో వచ్చిన ఆ సినిమా లాగే ఈ జంబలకడిపంబ కూడా కడుపుబ్బా నవ్విస్తుందా అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన వరుణ్(శ్రీనివాసరెడ్డి), ఫ్యాషన్ డిజైనర్ పల్లవి(సిద్ది) ఇద్దరు భార్య భర్తలు. మొగుడు పెళ్ళాలైనా ఈ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. వీరి మధ్యన గొడవలు ముదిరి లాయర్ హరి(పోసాని)ద్వారా విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల్లో హరి చనిపోయి స్వర్గానికి వెళ్లి మళ్ళీ ఆత్మ రూపంలో వెనక్కు వస్తాడు. వరుణ్, పల్లవిని ఎలాగైనా ఒక్కటి చేయాలనీ కంకణం కట్టుకుంటాడు. అందులో భాగంగా వరుణ్ ని అమ్మాయిగా…. పల్లవిని అబ్బాయిగా రూపాలు మార్చకుండా జెండర్ మాత్రం వేరయ్యేలా చేస్తాడు. అక్కడి నుంచి జంబలకిడిపంబ అసలు కథ మొదలవుతుంది. అసలు హరి ఆ జంటను ఎందుకు కలపాలి అనుకున్నాడు? మరో లాయర్ వెన్నెల కిషోర్ కి, దీనికి ఉన్న సంబంధం ఏంటి? చివరికి వరుణ్, పల్లవి లు కలిసిపోతారా? అనేది మిగతా కథ.

నటీనటులు నటన:

కమెడియన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి అవకాశమొస్తే హీరోగా మారిపోతున్నాడు. గతంలో గీతాంజలి సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరో పాత్రలాంటి పాత్ర చేసి సక్సెస్ కూడా అయ్యాడు. ఇప్పుడు కూడా జంబలకడిపంబ కోసం శ్రీనివాస్ రెడ్డి హీరో అవతారమెత్తాడు. స్టార్ హీరోల మూవీస్ లో స్టార్ కమెడియన్ అయిన శ్రీనివాస్ రెడ్డి తాజాగా హీరోగా చేసిన జంబలకడిపంబ సినిమాలో అనుకోని పరిస్థితుల్లో అమ్మాయిగా మారిపోవడం… అబ్బాయి డ్రెస్ లోనే అమ్మాయిలా వ్యవహరించడం అన్ని పర్ఫెక్ట్ గా చేసాడు. భార్య తో నిత్యం గొడవ పడే భర్తగా… అబ్బాయి అవతారంలో అమ్మాయి పనులు చేసే కేరెక్టర్ లో శ్రీనివాస్ రెడ్డి అద్భుతంగా నటించాడు. కానీ శ్రీనివాస రెడ్డి తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ…. స్క్రిప్ట్ వీక్ గా ఉండటంతో ఒక దశ దాటాక శ్రీనివాస్ రెడ్డి సినిమా కి హెల్ప్ లెస్ అయిపోయాడు. ఇక హీరోయిన్ సిద్ధి తన కేరెక్టర్ కి బాగానే సెట్ అయినా…. అక్కడక్కడా ఆమె చేసిన ఓవర్ యాక్షన్ చికాకు తెప్పిస్తుంది. ఉన్నంతలో వెన్నెల కిషోర్ కాస్త నయం అనిపిస్తుంది. పోసాని, సత్యం రాజేష్ లాంటి స్టార్ కమెడియన్స్ ని దర్శకుడు ఎందుకు ఉపయోగించుకోలేదన్నది ఆయనకే క్లారిటీ లేదు.

విశ్లేషణ:

గతంలో ఈ వి వి సత్యన్నారాయణ డైరెక్షన్ లో వచ్చిన జంబలకడిపంబ కామెడీ చిన్న పెద్ద అందరిని ఆకట్టుకుంది. ఆడవారు మగవారిగా… మగవారు ఆడవారిగా తారుమారు కావడం అనే పాయింట్ మీద అయన చేసిన కామెడీ అందరిని కడుపుబ్బా నవ్వించింది. కానీ ఇక్కడ ఈ జంబలకడిపంబ లో మాత్రం బోలెడు కామెడీకి అవకాశం ఉన్నా దర్శకుడు జెబి మురళి కృష్ణ దాన్ని అర్థం లేని కథనంతో పూర్తిగా వృధా చేసుకున్నాడు. పైగా అందరు ఆశించట్టు మొత్తం పాత్రలను జెండర్ చేంజ్ చేయకుండా దాన్ని హీరో హీరోయిన్ల పాత్రలకే పరిమితం చేయటంతో అంతగా వర్క్ అవుట్ కాలేదు. నవ్వు పుట్టించడానికి యమా కష్టపడిన డైలాగులు వెరసి సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ కలిగించాయి. భార్యభర్తల మధ్య మనస్పర్ధలను కామెడీ సహాయంతో మెసేజ్ ఇవ్వాలనుకున్న దర్శకుడు మురళీకృష్ణ ప్రయత్నం వీక్ స్క్రీన్ ప్లే వల్ల వృధా అయ్యింది. అలాగే పాటలు కూడా పనికిమాలిన ప్లేస్ లో పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక కామెడీ విషయంలోనూ దర్శకుడు పదే పదే ఫెయిల్ అయ్యాడు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, పోసాని వంటి కమెడియన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు వారిని కావాల్సిన మేర వాడుకోలేకపోయాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి అమ్మాయి లా, సిద్ది అబ్బాయిలా చక్కగా నటించినప్పటికీ ఉపయోగం లేదు. మరి కామెడీ కోసం ఎక్సపెక్ట్ చేసి సినిమా కెళితే కుర్చీల్లో కూర్చుని ఉసూరుమనడం ప్రేక్షకుల వంతు అవడం ఖాయం.

టైమింగ్ లేకుండా….

టైమింగ్ లేకుండా బలవంతంగా ఇరికించిన పాటలు విసుగు తెప్పిస్తాయి. అసలు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఇలాంటి సినిమాలకు సెట్ కాడని మరోసారి దీని సంగీతం ద్వారా ప్రూవ్ అయ్యింది. కాకపోతే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదనిపించింది. ఇక సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా వుంది… ఎడిటింగ్ మాత్రం బోర్ కొట్టించింది. సినిమాలో కత్తెర వేయాల్సిన సీన్స్ అనేకం ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా సో సో గా వున్నాయి.

 

రేటింగ్: 1.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*