జగన్ ఇలా….చంద్రబాబు పార్టీ ఎందుకలా?

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లుండి సీన్ మారింది. నిన్న మొన్నటి దాకా అధికార టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను నిర్వహిస్తే…ఇప్పుడు జగన్ పార్టీ ఆకర్ష్ ను మొదలు పెట్టినట్లుంది. అధికార టీడీపీలోకి నిన్నమొన్నటి దాకా వలసలు జోరుగా సాగాయి. ఒక్క వైఎస్సార్పీపీ నుంచే దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారు. వారిలో నలుగురికి ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కూడా కల్పించారు. ఇంకా అనేక జిల్లాల నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు వచ్చి చేరతారని టీడీపీ నేతలు ప్రకటించారు కూడా. అయితే తర్వాత టీడీపీలో చేరికలు ఇటీవల కాలంలో నిలిచిపోయాయి. జిల్లాల్లో అసంతృప్తులు పెరిగిపోయాయి. దీంతోనే చంద్రబాబు రోజుకో పంచాయతీతో తలపట్టుకుంటున్నారు. మరోవైపు కొత్తగా వచ్చి చేరిన వాళ్లతో టీడీపీ శ్రేణులకు అసలు పడటం లేదు.

ఆకర్ష్ ను స్టార్ట్ చేసిన వైసీపీ…

మరోవైపు వైసీపీలో చేరికలు ఊపందుకుంటున్నాయనిపిస్తోంది. అధికార పార్టీ నుంచి రావడమంటే మాటలు కాదు. మరో రెండేళ్లు ఎన్నికల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే జగన్ ఆకర్ష్ ను ప్రారంభించారని చెబుతున్నారు. టీడీపీలో బలమైన నేతలే జగన్ తో టచ్ లో ఉనట్లు తెలుస్తోంది. శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడి వెళతారని వార్తలొచ్చినా…టీడీపీ పెద్దగా కేర్ చేయలేదు. ఎందుకంటే అధికారపార్టీని వదలి ఎందుకు వెళతారన్న భ్రమల్లో ఆ నేతలు ఉన్నారు. శిల్పాను సర్ది చెప్పే ప్రయత్నమూ చేయలేదు. దీంతో నంద్యాలలో బలమైన నేత పార్టీని వీడి వెళ్లారు. శిల్పా బాటలోనే మరికొందరు వైసీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. చంద్రబాబు విధానాలకు విసిగిపోయి జగన్ పార్టీలో చేరేందుకు వస్తున్నారంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ కు ఎవరూ లోనుకాకపోవడం, ప్రతిపక్ష పార్టీలో చేరుతుండటం ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామమంటున్నారు విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1