జగన్ జట్టులో కిక్కు వచ్చిందే….!

వైఎస్ జగన్ శిబిరంలో ఆనందం కన్పిస్తోంది. పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఇప్పటి వరకూ పార్టీ నుంచి నివేదికలు వస్తున్నప్పటికీ, రిపబ్లికన్ టీవీ సర్వేలో వచ్చిన ఫలితాలు వైసీపీలో మరింత జోష్ ను నింపాయి. 25 పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్న సర్వే ఆ పార్టీకి మంచి కిక్కునిచ్చిందనే చెప్పొచ్చు. రిపబ్లికన్ సర్వేలో 25 స్థానాల్లో దాదాపు 13 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉందని తేలడంతో పార్టీ అధినేత జగన్ తో పాటు సీనియర్ నేతలకు కూడా జోష్ వచ్చింది. పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా దక్కించుకుంటామన్న నమ్మకం కలిగింది. దీంతో పాదయాత్రలో మరిన్ని మార్పులు తీసుకురావాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు.

శిబిరంలో సీనియర్ నేతలతో…..

ఇదే జోష్ ను కోస్తాంధ్రలో కూడా తీసుకెళ్లాలని జగన్ సూచించారు. ప్రతి జిల్లాలో ఇప్పటి వరకూ ఎనిమిది నియోజకవర్గాలనే పర్యటించారు. మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా నియోజకవర్గాల్లో క్యాడర్ లో జోష్ నింపాలని జగన్ భావిస్తున్నారు. జగన్ శిబిరంలోనే పార్టీ గురించి చర్చిస్తున్నారు. రాత్రి బస చేసిన సమయంలో జగన్ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఏపీ రాజకీయాల్లో జరుగతున్న పరిణామాలు, ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ నేతల పనితీరును జగన్ సీనియర్ నేతలతో సమావేశమవుతున్నారు. ఆయన పార్టీ సీనియర్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, భూమన కరుణాకరెడ్డిలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. చిత్తూరు జిల్లాలో వచ్చిన ఫీడ్ బ్యాక్ పై ఆయన వీరితో చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీని ఇక్కడ విజయపథంలో నడిపించాలంటే అభ్యర్థుల ఎంపికే ముఖ్యమన్నది సీనియర్ నేతల అభిప్రాయం. వారి అభిప్రాయాలను నియోజకవర్గాల వారీగా తీసుకున్నారు.

నేటి పాదయాత్ర ఇక్కడి నుంచి….

కోర్టుకు హాజరయ్యేందుకు ఒకరోజు విరామం తీసుకున్న జగన్ నేటి నుంచి తిరిగి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోపర్యటించనున్నారు. ఈరోజు ఉదయం ఏర్పేడు మండలం కుక్కల వారి కండ్రిక గ్రామం నుంచి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి వెంకటాపురం క్రాస్ రోడ్స్, కుమ్మర మిట్ట, మోదుగుపాలెం క్రాస్ రోడ్స్, కొత్త వీరాపురం, అగ్రహారం, కంబాక, అంజిమీడు క్రాస్ రోడ్స్ వరకూ సాగుతుంది. ఇక్కడ జగన్ భోజన విరామానికి ఆగుతారు. తిరిగి ఏర్పేడు, మెర్లపాక క్రాస్ రోడ్స్, హరిజనవాడ, చిండేపల్లి వరకూ యాత్ర కొనసాగనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1