జగన్ సీఎం కావాలంటే ఇలా చేయాల్సిందేనా?

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలాగైనా విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు. అందుకోసం అన్ని దారులనూ ఆశ్రయిస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ హైదరాబాద్ లో సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. వేద పండితులు నిర్వహించే కార్యక్రమంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ లోని మలక్ పేటలో ఈ యాగం ప్రారంభమైంది. జగన్ ముఖ్యమంత్రి కావాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు వేదపండితుడు శివరామప్రసాద్ శర్మ చెబుతున్నారు.

ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ…..

అయితే ఈ యాగం 2019 ఎన్నికలు జరిగి ఫలితాలు విడుదలయ్యే వరకూ కొనసాగనుంది. ఫలితాలు విడుదలయ్యాకే పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుదని పండితులు చెబుతున్నారు. వైసీపీ నేతలకు ఈసారి ఎన్నికలు చావోరేవో తలపిస్తున్నాయి. ఇటు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకోవడమే కాకుండా యజ్ఞ యాగాదులను కూడా నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళితే ఓట్లు వస్తాయి కాని యాగాలు, యజ్ఞాలు నిర్వహిస్తే వస్తాయా? అని నాస్తికవాదులూ అంటున్నారు. అయితే అన్ని ప్రయత్నాలు చేయడంలో తప్పేముందని, తమ నమ్మకాలు తమకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ సీఎం అయ్యేందుకు ఆ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*