జనసేన పార్టీ పెట్టటం వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు

pawankalyan konathala sitharam

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, శాసన సభ్యురాలు రోజా అధికార పార్టీ నాయకులపై విమర్శలు చేసినా, ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లని ఎండగట్టినా, శాసన సభలో ప్రదర్శించిన అనుచిత తీరు కారణాన బహిష్కరణకు గురైనా ప్రతిదీ సంచలనమే. అందుకే రోజాకి రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ వుంది. ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్ తన గళం లోని శక్తీ సామర్ధ్యాలన్నీ వాడి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఘాటైన విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా 2009 ఎన్నికల సమయంలో తాను తీవ్రంగా విమర్శలు చేసిన చిరంజీవి ప్రస్తావన తీసుకు వచ్చి పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి రాజకీయ పరిస్థితి ఎంతో మెరుగు అంటూ అభిప్రాయ పడ్డారు.

“సమాజంలో జరిగే తప్పులని ప్రశ్నించటమే ధ్యేయం అంటూ రాజకీయాలలోకి ప్రవేశించి జనసేన పార్టీ స్థాపించిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సాధించింది ఏమిటో నాకు అంతు చిక్కటం లేదు. తప్పు ని సహించబోనని స్టేట్మెంట్స్ ఇచ్చే పవన్ కళ్యాణ్, తాను మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ-తెలుగు దేశం పార్టీల పొత్తు ఇప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర అధికార పక్షాలుగా చలామణి అవుతూ సామాన్య ప్రజల కష్టాలే తమ కీర్తిగా భావిస్తూ నిత్యం ఏదో రూపేణా సామాన్యులని ఇక్కట్లకు గురి చేస్తున్న నరేంద్ర మోదీ, చంద్ర బాబు ల పాలన తీరుపై ఎందుకు మౌనంగా ఉండిపోయారో పవన్ కళ్యాణ్ కే తెలియాలి. ఇప్పటికి జన సేన పార్టీ స్థాపించి మూడు సంవత్సరాలు గడిచింది కానీ ఎటువంటి ప్రత్యక్ష ఎన్నికలలో ఆ పార్టీ ప్రభావం చూపలేదు సరికదా అసలు పోటీకి దిగలేదు. మరో రెండు సంవత్సరాలలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా జనసేన పార్టీ ప్రభావం ఏ మాత్రం ఉండబోదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటే ఆయన అన్నయ్య చిరంజీవే మేలు. ప్రజా రాజ్యం పార్టీ ని స్థాపించి కనీసం ఆ పార్టీ తరపున ఆయన కాండిడేట్స్ ని పోటీకి దింపి కొన్ని స్థానాలైనా గెలవగలిగారు. పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి కూడా జనసేన పార్టీని తీసుకు వెళ్ళలేరు.” అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై ధ్వజమెత్తారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*