టచ్ చేసి చూడు మూవీ రివ్యూ

బ్యానర్: లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్
నటీనటులు: రవితేజ, రాశి ఖన్నా, సీరత్ కపూర్, ఫ్రెడ్డీ దరువాలా, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: జామ్ 8 , బ్యాగ్రౌండ్ స్కోర్ మణిశర్మ
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
ప్రొడ్యూసర్: నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీ
దర్శకత్వం: విక్రమ్ సిరికొండ

బెంగాల్ టైగర్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్న రవితేజ… ఆ సినిమా విడుదలైన కొద్దీ కాలానికే టచ్ చేసి చూడు అంటూ బాక్సాఫీసు బరిలోకి దూసుకొచ్చేసాడు. విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రవితేజ ఈ టచ్ చేసి చూడు సినిమాని చేసాడు. తనకి అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో కనిపించాడు రవితేజ. చిన్న హీరో నాగ శౌర్య ఛలో సినిమాకి పోటీగా ఈ శుక్రవారమే రవితేజ టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందమైన భామలు రాశి ఖన్నా, సీరత్ కపూర్ లతో జోడికట్టిన రవితేజ టచ్ చేసి చూడు ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చెయ్యడమే కాదు సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. మరి రాజా ది గ్రేట్ హిట్ తో జోరు మీదున్న రవితేజ టచ్ చేసి చూడు తో హిట్ కొట్టి అదే జోరుని కంటిన్యూ చేశాడా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ
కార్తికేయ(రవితేజ)కు తన కుటుంబం అంటే పంచ ప్రాణాలు. తన కుటుంబంతో కలిసి కార్తికేయ పాండిచ్చేరిలో హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. అక్కడ ఒక ఇండస్ట్రీని నడుపుతున్న కార్తికేయ కు తన చెల్లెలి వలన సమస్యలు వచ్చి పడతాయి. కార్తికేయ చెల్లెలు ఓ యువకుడి హత్యను కళ్లారా చూస్తుంది. ఆ హత్య విషయంలో కోర్టులో సాక్ష్యం చెబుతానంటున్న చెల్లెలి కోసం ఆ హత్యకి కారణమైన వాళ్ళని కనిపెట్టాలనుకుంటాడు కార్తికేయ. అటువంటి సమయంలోనే కార్తికేయ పుష్ప(రాశి ఖన్నా)ను ప్రేమిస్తూ ఉంటాడు. అయితే గొడవలకు దూరంగా ఉంటున్న కార్తికేయ కుటుంబం కార్తికేయ చెల్లెలు చెప్పబోయే సాక్ష్యం విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఆ హత్యకు సంబందించిన వ్యక్తులను వెతికే క్రమంలో కార్తికేయకు గతంలో శత్రుత్వం ఉన్న మాఫియా డాన్ ఇర్ఫాన్ లాలా(ప్రెడ్డి దారూవాలా) కనిపిస్తాడు. మరి పోలీస్ రికార్డ్స్ లో చనిపోయాడనుకుంటున్న మాఫియా డాన్ ఇర్ఫాన్ లాలా బ్రతికుండడం చూసి ఖంగు తింటాడు కార్తికేయ. అప్పటినుండి మాఫియా డాన్ ఇర్ఫాన్ లాలా వేటలో పడతాడు కార్తికేయ. అసలు ఎసిపి కార్తికేయ పోలీస్ ఉద్యోగం వదిలేసి ఇంత దూరం ఎందుకు వచ్చాడు? అసలు గతంలో కార్తికేయ ఎలాంటి వాడు? అలాగే కార్తికేయ ప్రేమించిన దివ్య(సీరత్ కపూర్)ఏమైంది? అలాగే కార్తికేయ ప్రేమించిన పుష్ప ని కార్తికేయ పెళ్లాడతాడా? కార్తికేయ యువకుడి హత్యకు కారణమైన వాళ్ళని పట్టుకున్నాడా? మరి ఇన్ని విషయాలు తెలియాలి అంటే టచ్ చేసి చూడు సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటులు నటన:
రవితేజకున్న కామెడీ టైమింగ్ ఏ హీరోకి లేదనేది తెలిసిన విషయమే. అలాగే రవితేజాకున్న అతి పెద్ద బలం ఎనర్జీ. అందుకే బలమైన బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం తనకంటూ సొంత ఇమేజ్ తో మార్కెట్ ఏర్పరుచుకుంటూ వచ్చాడు. ఎప్పటిలాగే తన ఎనర్జీతో… తన విశ్వరూపం చూపించేసాడు. పోలీస్ పాత్రలో మరోమారు తానేమిటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలోని కార్తికేయ పాత్ర గతంలో చేయనిది కాదు, చూడనిది కాదు. అలవోకగా చేసుకుంటూ పోయాడు. కాని పవర్, విక్రమార్కుడు లాంటి సినిమాలు గుర్తుకు రావడంలో మాత్రం అతని తప్పు లేదు. టచ్ చేసి చూడు కథే ఆ ఫార్మట్ లో ఉంది. కాకపోతే రవితేజ వయసు కొన్ని క్లోజ్ అప్ షాట్స్, పాటల్లో క్లియర్ గా తెలిసిపోతోంది. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే హీరొయిన్ రాశి ఖన్నా లుక్ లో మార్పు స్పష్టంగా చూడవచ్చు.తన పాత్రను మొక్కుబడిగా తీర్చిదిద్దాడు విక్రమ్ సిరికొండ. గ్లామర్ కోసం ఉద్దేశించిన పాత్ర కాబట్టి ఎక్కువ ఆశించడానికి ఏమి లేదు. కొన్నిచోట్ల రవితేజ తో పోటీపడి కామెడీ చేసింది. ఇక మరో హీరోయిన్ కేవలం గ్లామర్ కె తప్ప మరేందుకు లేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయ్యే సీరత్ కపూర్ పాత్రకి ప్రాధాన్యతే లేదు. విలన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న ఫ్రెడ్డి దారువాలా లుక్స్ లో బాగున్నాడు. వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ కామెడీ అక్కడక్కడ పేలింది. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:
జామ్ 8 పేరుతో ప్రీతం టీం అందించిన పాటలు పర్వాలేదు అనుకున్నట్టుగా ఉన్నప్పటికీ.. బయటికి వచ్చేటప్పుడు ఒక్కటి కూడా గుర్తుండవు. ఇక ప్రత్యేకంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఏమంత చెప్పుకునే స్థాయిలో లేదు. కాకపోతే బోర్ అనిపించదు అంతే. చోటా కె నాయుడు కెమెరా పనితనం మాత్రం బాగా ఉంది. చాలా విషయాల్లో ఈసినిమాకి సినిమాటోగ్రఫీ హైలెట్. గౌతం రాజు ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది అనిపిస్తుంది. అది కేవలం లెంగ్త్ వల్ల వచ్చిన ఫీలింగ్ వల్లే. ఇక నల్లమలుపు బుజ్జి – వంశీ మోహన్ నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ అనే ప్రసక్తే తీసుకురాలేదు. నిర్మాణ విలువలకు ఎక్కడ వంక పెట్టడానికి లేదన్నమాట.

దర్శకత్వం:
దర్శకుడు విక్రం సిరికొండ మొదటిసారి దర్శకుడిగా సినిమా పరిశ్రమకు టచ్ చేసి చూడుతోనే పరిచయమయ్యాడు. అతనికి ఇది మొదటి సినిమా. మరి డెబ్యు మూవీకే రవితేజ లాంటి ఇమేజ్ ఉన్న హీరోను తాను చెప్పిన కథతో మెప్పించాడు అంటేనే అందులో చాలా విషయం ఉంటుందని ప్రేక్షకులు కూడా ఆశించారు. టచ్ చేసి చూడు కథ మాత్రం ఒట్టి రొటీన్ కథే. ఏమాత్రం కొత్తదనం లేని కథ. రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరోను ఎలాఉపయోగించుకొవాలో కూడా దర్శకుడికి చేతకాలేదు. అసలు ఇలాంటి రొటీన్ రోడ్డు కొట్టుడు కథని ఎంతో అడ్వాన్స్ గ ఆలోచించే రవితేజ ఎలా ఒప్పుకున్నాడో అనేది అస్సలు అర్ధం కానీ విషయం. సెకండ్ హాఫ్ లో మాస్ కి కిక్ ఇచ్చే టెంపో కొంత వరకు బాగానే మైంటైన్ చేసినప్పటికీ ఫస్ట్ హాఫ్ లో జరిగిన డ్యామేజ్ సెకండ్ హాఫ్ ని కూడా అదే కోణంలో చూడటం ప్రారంభించడంతో రొటీన్ గానే అనిపిస్తుంది. టచ్ చేసి చూడుని దెబ్బ తీసింది అదే. అసలు రైటర్ వక్కంతం వంశీ కథలు ఎప్పుడైనా అసాధారణంగా ఉండవు. రెండు హత్యలకు కారణమైన విలన్ ని మట్టుబెట్టడమే ఈ సినిమాకథ. మరి ఇలాంటి కథలతో గుర్తుకుతెచ్చుకోలేనన్ని సినిమాలు తెరకెక్కాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, హీరోయిన్ తో రొమాన్స్ తో పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ విషయానికొస్తే సీరియస్ నెస్, కథను పూర్తిగా రివీల్ చెయ్యడం, హీరో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఇలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ సెకండ్ హాఫ్ లో మిస్అవడంతో ప్రేక్షకుడికి చికాకు తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా బలహీనంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే కోసం విక్రమ్ తో పాటు దీపక్ రాజ్ కూడా తోడయ్యాడు. ఇందరు కలిసినందుకే కిచిడి అయ్యిందేమో అని సందేహం కలుగుతుంది.

పాజిటివ్ పాయింట్స్: రవితేజ, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్: రొటీన్ స్టొరీ, ఫస్ట్ హాఫ్, పాటలు, ఎడిటింగ్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రవితేజ లుక్, కామెడీ

రేటింగ్: 2.0 /5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*