టి పిసిసి చీఫ్ చెలరేగిపోతున్నారే …!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమకుమార్ రెడ్డి అసెంబ్లీలో చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్ సభాపక్ష నేత జానారెడ్డి ఏ మాత్రం గ్యాప్ తీసుకున్నా పిసిసి చీఫ్ అధికార టిఆర్ఎస్ పై నిప్పులు కురిపిస్తున్నారు. తాజాగా ఉత్తమ్ ఫీజు రీఎంబర్స్ మెంట్ పై ఒకరేంజ్లో దాడి చేశారు ఉత్తమ్. లక్షా 49 వేలకోట్ల రూపాయల బడ్జెట్ వున్నా ఏడాది కాలంగా 13 లక్షలమంది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్లకు ఇస్తున్న ప్రాధాన్యత విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదంటూ నిప్పులు చెరిగారు.

ఉత్తమ్ పై బహుముఖ దాడి…

కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధిస్తే అధికారపక్షం నుంచి ఫైర్ బ్రాండ్స్ హరీష్ రావు , కేటీఆర్ వారిద్దరూ సరిపోరు అనుకుంటే కేసీఆర్ సీన్లోకి దిగుతున్నారు. ఇక వారు నేరుగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు అప్పుడు జరిగిన అవకతవకలను ఎత్తి చూపుతూ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తూ తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా సాగుతుంటే చూడలేక పోతున్నారంటూ దుమ్ము లేపేస్తున్నరు. ఉత్తమకుమార్ రెడ్డి ఫీజు రీఎంబర్స్ మెంట్ పై చేసిన ఆరోపణలకు మంత్రి హరీష్ ఇలాగే ఫైర్ అయ్యారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం , జలయజ్ఞం ధనయజ్ఞం కాంగ్రెస్ అలవాటు చేసిన అక్రమ విధానాలని తాము అలాంటివి చేయడం లేదన్నారు. హరీష్ కౌంటర్ ఇచ్చినప్పటికీ మంత్రి ఈటెల రాజేందర్ సైతం ఉత్తమకుమార్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. మొత్తానికి టి అసెంబ్లీ లో ఉత్తమకుమార్ ఉంటే సర్కార్ పై ఏదో ఒక అంశంలో తీవ్రంగా విమర్శలు ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*