టీడీపీలో సీనియర్లకు పెద్దపీట

కూన రవికుమార్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేసింది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి శతుచర్ల విజయరామరాజుకు శ్రీకాకుళం జిల్లా నుంచి అవకాశమిచ్చింది. గతంలో కాంగ్రెస్ప్ర భుత్వంలో శత్రుచర్ల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ తీర్థం తీసుకున్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన చిక్కాల రామచంద్రరావుకు అవకాశం ఇచ్చారు. తెలగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచే చిక్కాల పార్టీలో ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం చిక్కాలకు ఉంది. చిక్కాల ఎంపికతో సీనియర్లను, పార్టీకి కట్టుబడి ఉన్నవాళ్లను విస్మరించబోమన్న సంకేతాలను టీడీపీ పార్టీ శ్రేణులకు ఇచ్చినట్లయింది.

పాత కాపులకూ చోటు….
ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ గా ఉన్న అంగర రామ్మోహనరావుకు మళ్లీ అవకాశమిచ్చింది పార్టీ అధిష్టానం. ఇదే జిల్లా నుంచి మంతెన సత్యనారాయణరాజుకు టిక్కెట్ ఖరారు చేసింది. ఇక నెల్లూరు నుంచి వాకాటి నారాయణరెడ్డిని బరిలోకి దించనుంది. కర్నూలు జిల్లాలో శిల్పా బ్రదర్స్ లో అసంతృప్తిని పారదోలేందుకు శిల్పా చక్రపాణిరెడ్డికి టిక్కెట్ కేటాయించారు. శిల్పా సోదరులు భూమా నాగిరెడ్డి రాకపై గుర్రుగా ఉండటంతో వారికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే చిత్తూరు జిల్లా నుంచి రాజనరసింహులును ఎంపిక చేశారు. ఈయన కూడా పార్టీ దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారే. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లను త్యాగం చేసిన వారికీ ప్రస్తుతం చోటు దక్కింది. అయితే వీరందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*