డేరా బాబాకు వీళ్లు ఫిదా ఎందుకయ్యారంటే?

another shock to dera baba

రేప్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన రామ్ రహీం బాబా ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆయన ఆస్తులు దాదాపు 900 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయని అంచనా. వందల కోట్ల ఆస్తులను కూడ బెట్టిన డేరా బాబా సేవా కార్యక్రమాలను కూడా జోరుగానే చేస్తారు. డేరా లో సభ్యత్వం ఉన్నవారికి ప్రభుత్వం నుంచి దొరికే రేషన్ ధర కన్నా అతి తక్కువ ధరకు బాబా సంస్థలు ఇస్తాయి. దీంతో లక్షలాది మంది డేరా గ్రూపులో సభ్యులుగా చేరిపోయారు. దేశవ్యాప్తంగా డేరా తన దుకాణాన్ని తెరిచారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో కూడా యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేసిన డేరా బాబాకు దాదాపు వందకు పైగానే అతి ఖరీదైన కార్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే దేశవ్యాప్తంగా 250 వరకూ ఆశ్రమాలున్నాయి.

వందల కోట్ల ఆస్తులు…….

వివిధ పట్టణాల్లో వాణిజ్య భవనాలను కూడా నిర్మించారు ఈ కమర్షియాల్ బాబా. ఈ షాపింగ్ కాంప్లెక్స్ ల నుంచే డేరా బాబాకు 16 లక్షల రూపాయల ఆదాయం రోజుకు లభిస్తుందంటే అతిశయోక్తి లేదు. ఈ బాబాకు ఒక్క సిర్సాలోనే 700 కోట్ల విలువైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రులను కూడా నిర్మించారు బాబా. తన భక్తులకు ఈ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తుండటంతో ఎక్కువ మంది భక్తులు డేరా బాబాకు ఫిదా అయిపోయారు. అంతర్జాతీయ ఐ బ్యాంక్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ బాబాకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఆరుకోట్లకు మందికి పైగానే భక్తులు ఉన్నారు. ఈ బాబా మూడు సినిమాల్లోనూ నటించడ విశేషం. డేరా బాబా స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. దీంతో బాబా ఆస్తులు 900 కోట్లకు చేరాయంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*