డేరా బాబా…జైలులో మరో శశికళలా…!

గుర్మీత్ సింగ్ బాబా జైలులో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తొలి పదిరోజులూ వెక్కి వెక్కి ఏడ్చిన డేరాబాబా ఇప్పుడు సర్దుకున్నాడు. జైలులో అన్ని వసతులూ సమకూరుతుండటంతో ఆయన జైలులో జోష్ తో ఉన్నాడు. ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్ బాబా సునారియా జైలులో శిక్ష అనభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇరవై ఏళ్ల జైలు శిక్ష కోర్టు ఖరారు చేసింది. అయితే గుర్మీత్ కు అన్ని విధాలుగా జైలు అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డేరా బాబాకు కావాల్సిన వసతులన్నింటినీ జైలు అధికారులు సమకూర్చిపెడుతున్నట్లు చెబుతున్నారు. పరప్పణ అగ్రహారం జైలులో శశికళ రెండు కోట్ల రూపాయలు లంచం ఇచ్చి రాజభోగాలు అనుభవించిన తీరును మనం చూశాం. అయితే ఇక్కడ డేరా బాబా డబ్బులు ఇచ్చాడో? లేదో? తెలియదు కాని ఆయనకు కూడా జైలులో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారట. జైలులో మినరల్ వాటర్ తో పాటు డేరాబాబా ఎప్పుడు అడిగినా జ్యూస్ అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఆయనకు అందుతున్న సౌకర్యాలు కనపడకుండా ఉండేందుకు ఇతర ఖైదీలను ఆ బ్యారక్ వైపు అధికారులు రానివ్వడం లేదు.

ములాఖత్ లకు కావాల్సినంత సమయం….

డేరాబాబా కూలీ పని రోజూ చేస్తున్నాడని, ఆయనకు రోజుకు ఇరవై రూపాయలు దినసరి వేతనం కింద చెల్లిస్తున్నామని జైలు అధికారులు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అదంతా ఉత్తుత్తిదేనట. డేరా బాబా అసలు పని చేయడట. ఆయన బయటకు రావడం తాను చూడలేదని నిన్న అదే జైలు నుంచి విడుదలయిన రాహుల్ అనే ఖైదీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆయన పనిచేస్తుండగా తాను చూడలేదన్నాడు రాహుల్. అంతేకాదు డేరాబాబాను కలవడానికి వచ్చిన వారందరినీ గంటల తరబడి మాట్లేడేందుకు జైలు అధికారులు అనుమతిస్తుండటం కూడా అనుమానాలకు తావిస్తోంది. డేరాబాబాతో గంటలు గంటలు మాట్లాడుతున్నా జైలు అధికారులు అభ్యంతరం పెట్టడం లేదు. దీంతో జైలు అధికారుల వ్యవహారశైలిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. జైలులో మరో డేరా సామ్రాజ్యాన్ని నిర్మించుకునేలా ఉంది ఈ బాబా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1