డేరా బాబా లైఫ్ స్టయిల్ ఇలా రివర్స్ అయిందే

గుర్మిత్ బాబా అలియాస్ డేరా బాబా. ఈ ప్రపంచంలోనే అత్యంత స్టైలిష్ బాబా. బాబాలకు ఉండాల్సిన లక్షణాలేవీ ఇతనిలో లేవు. జీన్స్ ప్యాంట్స్ డిజైనర్స్ షర్ట్ తో వుంటాడు. ఇటీవల కాలంలో అయితే తెల్లని దుస్తులు పై నుంచి కింద వరకు ఉండే డ్రెస్ లను వాడుతున్నాడు. సల్వార్ కమీజ్ మాదిరిగా వుండే తెల్లని దుస్తులు , మధ్యలో బ్లాక్ బెల్డును . పొడవాటి గడ్డం, పెద్ద జుట్టుతో వుంటున్నాడు. అయితే ఈ డేరా బాబాకు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడిన నేపథ్యంలో బాబా డ్రెస్ కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే జైలు మ్యానువల్ ప్రకారం శిక్ష పడిన వారు జైల్లో వారిచ్చిన దుస్తులే వేసుకొవాలి.. జైలు మ్యాను వల్స్ ప్రకారం రెండు షర్ట్స్. రెండు ప్యాంట్స్, రెండు నిక్కర్లు. రెండు టవల్స్.. రెండేసి చొప్పున బనియన్స్ , డ్రాయర్స్ నే వాడవలసి వుంటుంది. ఈ డ్రెస్ లు కూడా అందరిన ఖైదీలతో పాటుగానే డేరా బాబా వేసుకోవాల్సి వుంటుంది.

ఇరవై ఏళ్లూ జైలు నిబంధనల ప్రకారమే…..

ఒకప్పుడు చేయి ఎత్తితే భక్తులు వచ్చి సేవలు చేస్తుంటారు. అలాంటి సేవలు ఇప్పడు వుండవు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ,, ఒక టీ ఇస్తారు. తర్వాత లంచ్ లో ఎదైనా శాఖహారం ఇస్తారు. అది కూడా జైలు మ్యానువల్స్ ప్రకారం కొన్ని వందల గ్రాములను కొలిచి ఇస్తారు. తరువాత సాయంత్రం ఒక్కసారి టీ. రాత్రి డిన్నర్ ఇస్తారు. ఉదయం టిఫిన్ చేసిన తరువాత జైల్లో ఏదైన పనిని తప్పని సరిగా చేయాల్సి వుంటుంది. ఖాళీ గా కూర్చుని కబర్లు చెబుతామంటే కుదరదు. అందరితో పాటుగా పని చేయాల్సి వుంటుంది. అందరికి ఇచ్చినట్లుగానే రోజు వారి వేతనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏసీ గదులు,, అందమైన బాత్ రూమ్, కాలు కింద పెడితే నలిగి పొతుందా అన్న లెవల్ లో వుండే మక్‌ మల్ క్లాత్స్ లాంటివి ఏమీ ఉండవు. ఈ ఇరవై సంవత్సరాల జైలు జీవితం మొత్తం కూడబాబా ఇదే విధంగా ఉండాల్సి వస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*