డేరా హార్డ్ డిస్క్ లలో ఏముంది ..?

another shock to dera baba

డేరా సచ్చ సౌధను జల్లెడ పట్టిన పోలీసు విచారణ బృందాలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు డేరా అనుచరులు . తనిఖీ సందర్భంగా ఆశ్రమంలోని పలు కంప్యూటర్ లలో హార్డ్ డిస్క్ లు మాయం కావడంతో అందులో ఏమున్నాయి ..? ఎవరు మాయం చేశారు ..? ఎందుకు చేశారు అనే అంశాలపై దర్యాప్తు బృందాలు దృష్టి పెట్టాయి . ఈ కంప్యూటర్ లను నిర్వహించే డేరా అనుచరులను కొందరిని అదుపులోనికి తీసుకోగా, మరికొందరు ఇంకా పరారీలోనే వున్నారు . దాంతో వీరికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు. డేరా ఆస్తులు , బ్లూ ఫిలిమ్స్ తీసి మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన తీరు అందులో నిక్షిప్తం అయ్యి వుంటాయని పోలీసులు భావిస్తున్నారు .

బయట పడుతూనే వున్న అస్థిపంజరాలు …

మాయ బాబా గుర్మీత్ రామ్ రహీం అకృత్యాలు తవ్వేకొద్దీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. డేరా ఆశ్రమంలో అస్థిపంజరాలు ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆశ్రమంలో సోదాలు మరికొన్ని రోజులపాటు పట్టే అవకాశం వుంది. వెయ్యి ఎకరాల్లో సువిశాల ప్రాంగణ ఆశ్రమంలో జల్లెడ పట్టడం అంత ఆషా మాషి కాదు. ప్రతి అంగుళం అంగుళం సోదా చేసి గుర్మీత్ బండారాలు మొత్తం ఆధారాలతో బయట పెట్టె పనిని దర్యాప్తు బృదాలు ప్రతిష్టగా భావించడం విశేషం .

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*