తమిళనాడులో రజనీకి ప్రత్యేక ఓటు బ్యాంక్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని తేలిపోయింది. రజనీ కాంత్ ముఖ్య సన్నిహితుడు గాంధేయ ఇయక్కం నేత తమిళరవి మణియన్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై అభిప్రాయసేకరణ చేపట్టారు. చెన్నైలో మణియన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పెద్దయెత్తున రజనీకాంత్ అభిమానులు, సన్నిహితులు హాజరయ్యారు. తమిళ రాజకీయాల్లోకి రజనీకాంత్ రావాల్సిందేనని ఈ సమావేశంలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. రజనీ రాకతో తమిళ రాజకీయాలు పూర్తిగా మారిపోనున్నాయని తెలిపారు. జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇప్పుడు తమిళనాడులో రజనీ రాకకోసం వేల సంఖ్యలో అభిమానులు, ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

అవినీతి లేని రాజకీయాలు……..

అలాగే తమిళనాడులో ప్రస్తుతం రజనీకాంత్ కు 25 శాతం ఓటు బ్యాంకు ఉందని, రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించగానే మరో 20 శాతం ఓటు బ్యాంకు పెరిగే అవకాశముందన్నారు. రజనీకాంత్ కు తమిళ ప్రజలు సినీ జీవితాన్ని ఇచ్చారని, అందుకు వారికి ప్రతిగా సేవ చేయాలన్నదే రజనీకాంత్ ఉద్దేశమని మణియన్ చెప్పారు. అవినీతి లేని రాజకీయాలను నడపటంతో పాటు ప్రజలకు మరిన్ని సౌకర్యాలను కల్పించడమే రజనీ ముందున్న లక్ష్యమని మణియన్ వివరించారు. మొత్తం మీద తమిళనాడులో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*