తలైవాపై స్వామి సంచలన వ్యాఖ్యలు

సూపర్ స్టార్ రజనీకాంత్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి నోరుపారేసుకున్నారు. రజనీకాంత్ నిరక్షరాస్యుడని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాలకు పనికి రాడని కూడా వ్యాఖ్యానించారు. రజనీకాంత్ అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి ఇరుక్కుపోతారని కూడా స్వామి వ్యాఖ్యానించారు. రాజనీకాంత్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన అభిమానులతో సమావేశం కూడా మరోసారి అవుతున్నారు. సెప్టంబరు, అక్టోబర్ మాసాల్లో రజనీ మరోసారి సమావేశమై డిసెంబర్ లో పార్టీని ప్రకటించే అవకాశముంది. అయితే నిన్ననే బీజేపీ నేత రజనీకాంత్ సన్నిహితుడు గురుస్వామి రజనీకాంత్ ఎన్డీయేకు మద్దతిస్తారని ప్రకటించిన మరుసటి రోజే స్వామి సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. స్వామి వ్యాఖ్యలపై తలైవా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో స్వామి చీల్చి చెండాడుతున్నారు.