తెలుగు రాష్ట్రాల్లో ఆహార కొరత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భవిష్యత్తులో తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఐదారేళ్లుగా వరుసగా ఆహార ఉత్పత్తుల దిగుబడులు తగ్గిపోయాయి. తామ ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆహార ఉత్పత్తుల వైపు నుంచి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల కొరత తీవ్రమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

వాణిజ్య పంటల వైపు మొగ్గు….
వర్షాలు సరిగా కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగింటడంతో రెండు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా కరువు నెలకొని ఉంది. దీంతో రైతు డీలా పడిపోయాడు. ఒకప్పుడు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రెండు రాష్ట్రాలు ఇప్పడు చివరి స్థానానికి చేరుకుంటున్నాయి. స్వామినాధన్ కమిషన్  సిఫార్సులను కూడా రెండు ప్రభుత్వాలు పక్కన బెట్టేశాయి. ఆహార ఉత్పత్తుల ధరలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం వల్లనే రైతులు వాణిజ్య పంటలవైపు మొగ్గు చూపుతున్నారని, ఆహార ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వాలని స్వామినాధన్ కమిషన్ చేసిన సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. అటు కేంద్ర ప్రభుత్వమూ రైతు సమస్యలపై దృష్టి సారించలేదు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో తాము ఎలా సాగు చేస్తామంటున్నారు అన్నదాతలు.

తగ్గిన దిగుబడి…..
ఒక తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే 2013-14 సంవత్సరంలో 107 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. తర్వాత ఏడాది 69 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నున తీసుకుంటే 37 లక్షల టన్నులకు ఉత్పత్తి పడిపోయింది. ఈ లెక్కలను చూస్తేనే అర్ధమవుతోంది. ఆహార ధాన్యాల దిగుబడి ఎంత దారుణంగా పడిపోతుందో. పప్పుధాన్యాలది కూడా అదే పరిస్థితి. పప్పుధాన్యాలు ఏటా 6 లక్షల టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉండగా మూడు లక్షలకు పడిపోయింది. సగానికి సగం పడిపోవడంతో వ్యవసాయ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాల్లో ఆహార ధాన్యాలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వాలకు సరైన సమగ్ర వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నా

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*