దేవినేని ఉమా వ‌న్ మ్యాన్ షో….!

అవును. కృష్ణా జిల్లాలో రాజ‌కీయాలు ఇలానే మారిపోయాయ‌ని, మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు వ‌న్ మ్యాన్ షో నిర్వ‌హిస్తున్నార‌ని, అంతా తాను చెప్పిన‌ట్టే న‌డ‌వాల‌ని భావిస్తున్నార‌ని అంటున్నారు. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న దేవినేని.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద 80% మార్కులు సంపాదించి సంతృప్త స్థాయిలోనే ఆయ‌న ప‌ని చేస్తున్నారు. ముఖ్యంలో ప‌ట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో నిర్మించి ముఖ్యమంత్రి వ‌ద్ద మార్కులు కొట్టేసిన దేవినేని.. త‌ర్వాత ప్రాధాన్యంగా పోల‌వ‌రం ప్రాజెక్టును సైతం భుజానికి ఎత్తుకున్నారు. ఇలా ప్ర‌భుత్వంలో కీల‌క వ్య‌క్తిగా ఉన్న దేవినేని.. సీఎంను మ‌చ్చిక చేసుకోవ‌డంలో ముందున్నారు.

చంద్రబాబు వద్ద మంచి మార్కులు కొట్టేసి…..

కీల‌క‌మైన ఇరిగేష‌న్ శాఖా మంత్రిగా కేబినెట్‌లో త‌న శాఖా ప‌రంగాను, ఓవ‌రాల్‌గాను ఉమా తిరుగులేని అధికారం చెలాయిస్తున్నారు. అయితే, అదేస‌మ‌యంలో కృష్ణా జిల్లాలోనూ త‌న హ‌వా సాగాల‌ని ఆయ‌న భావిస్తుండ‌డమే వ‌ర్గ పోరుకు కార‌ణ‌మ‌వుతోంది. జిల్లాలోని కీల‌క‌మైన నేత‌లు .. ఇప్పుడు దేవినేని చెప్పిన‌ట్టు న‌డ‌చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందా ? అదే జరుగుతుందంటున్నారు. కొన్నాళ్లుగా రాజ‌కీయంగా ఎవ‌రు స్పందించాల‌న్నా.. త‌న అనుమ‌తి ఉండాలి- అనే ధోర‌ణిలో దేవినేని వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీక‌ర్‌ మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ వంటి వారితో దేవినేని తీవ్రంగా విభేదిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌తోనూ దేవినేనికి ప‌డ‌డం లేద‌ని స‌మాచారం. స్థానికంగా ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు సైతం ఆయ‌న‌కు చెప్ప‌కుండానే అమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు.

ఎవరితో పడదా?

అంతెందుకు ప‌ట్టిసీమ వాట‌ర్‌ను కాలువ ద్వారా ఎక్క‌డిక‌క్క‌డ త‌మ కాలువ ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వెళితే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేలు త‌మ ప్రాంతానికి మోటార్లు, పైపుల ద్వారా మ‌ళ్లించుకున్నారు. అదే టైంలో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రైతుల‌ను ఆదుకునేందుకు వంశీ త‌న సొంత ఖ‌ర్చుతో మోటార్ల‌ను ఏర్పాటు చేయించి నీళ్లు తోడిస్తే ఆ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఉమా టార్గెట్ చేసి మ‌రీ ఆ మోటార్లు తీయించే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.జిల్లాలో అధికారుల‌ను శాసిస్తూ ఇక్క‌డ త‌న మాటే నెగ్గాల‌ని ఉమా ఏక‌చ‌క్రాధిప‌త్య పోక‌డ‌ల‌తో ముందుకు వెళుతుండ‌డంతో పాటు ఎవ‌రైనా ఎదిగితే త‌న‌కు పోటీగా వ‌స్తారేమోన‌న్న ఆందోళ‌న‌తో ఆయ‌న వ్య‌వ‌హార శైలీ ఉంద‌న్న ఆరోప‌ణ‌లు సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే తీవ్రంగా ఉన్నాయి. ఫ‌లితంగా నేత‌లు తీవ్ర మాన‌సిక క్షోభ‌ను అనుభ‌విస్తున్నార‌ని తెలుస్తోంది. ఎవ‌రూ మీడియా ముందుకు వ‌చ్చే సాహ‌సం కూడా చేయ‌డం లేదు. ఇక‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఉన్నారా? లేరా? అనే సందేహం వ‌స్తోంది. గ‌ద్దేతోనూ ఆయ‌న‌కు ప‌డ‌దు. గ‌త ఎన్నిక‌ల్లో గ‌ద్దె భార్య అనూరాధ‌కు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఇక్క‌డ ఆయ‌న‌కు సీటు రాకుండా ఆయ‌న కొంత వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేశార‌న్న టాక్ కూడా జిల్లాలో ఉంది.

పార్టీకి నష్టమేనా?

విజ‌య‌వాడ న‌గ‌రంలో టీడీపీకి ఇద్ద‌రు కీల‌క‌మైన ఎమ్మెల్యేలు, ఎంపీ ఉన్నా మంత్రి దేవినేని ఉమా .. త‌న హ‌వా సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. కేశినేని నాని ఇప్ప‌టికే మంత్రి ఉమా తీరుపై ప‌బ్లిక్‌గానే త‌న అసంతృప్తి వ్య‌క్తం చేసి చివ‌ర‌కు చంద్ర‌బాబు చేతిలో వార్నింగ్‌లు కూడా తిన్నారు. ఏదేమైనా ఉమా జిల్లాలో వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుతో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిని గుర్తించి పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*