నగరిలో గాలి ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి

నగరిలో వాణి విశ్వనాధ్ ను వచ్చే ఎన్నికల్లో పోటీకి దించుతామని కొందరు టీడీపీ స్థానిక నేతలు ప్రకటించడం పట్ల గాలి ముద్దు కృష్ణమనాయుడి కుటుంబం మండిపడుతోంది. గాలి కొంతకాలంగా నగరిలోనే ఉంటున్నారు. గాలి ముద్దు కృష్ణమతో పాటు ఆయన కొడుకులిద్దరూ నగరి రాజకీయాల్లోచురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఉన్నట్లుంది వాణి విశ్వనాథ్ ను వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయిస్తామని ప్రకటించడం, వాణి విశ్వనాథ్ కూడా వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలను ఇవ్వడం గాలిని మనస్తాపానికి గురి చేసింది. వాణి విశ్వనాథ్ మేనేజర్ నాయుడు ఇక్కడి టీడీపీ నేతలకు బాగా దగ్గర కావడంతో వారితో చంద్రబాబుతో నగరి టిక్కెట్ వాణి విశ్వనాథ్ కు ఇప్పిస్తానని చెప్పారట. దీంతో వాణి విశ్వనాధ్ రెండు రోజులు నగరిలో కూడా పర్యటించారు.

వాణి విశ్వనాధ్ కు తెలుగు వచ్చా?

గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ అభ్యర్ధిగా గాలి ముద్దు కృష్ణమ నాయుడు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఎమ్మెల్సీ అవ్వనంత వరకూ నగరి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత నగరి నియోజకవర్గంలో గాలి ముద్దు కృష్ణమ బాగానే తిరుగుతున్నారట. గాలి ఇద్దరుకుమారులు కూడా నగరిలోనే ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. అయితే వాణి విశ్వనాధ్ పేరునుతీసుకు రావడంలో లోకల్ లీడర్స్, సినిమా రంగానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్న అనుమానం గాలి ఫ్యామిలీ వ్యక్తం చేస్తోంది. వాణి విశ్వనాధ్ మలయాళీ. మళయాళీ అమ్మాయిని తెలుగు రాష్ట్రానికి ఎలా తీసుకువస్తారని గాలి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. నగరిలో రోజాను గ్లామర్ తో ఢీకొట్టాలంటే గ్లామర్ నే తీసుకురావాలనే ప్రయత్నం మానుకోవాలని సూచిస్తున్నారు. తెలుగు మాటలు కూడా సరిగా రాని వాణి విశ్వనాధ్ ను ఎంపిక చేస్తే ఊరుకోబోమని కూడా హెచ్చరిస్తున్నారు. 2004లో గాలి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద నగరిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు టీడీపీలో చిచ్చు రేపాయి. ఈ విషయంపై గాలి మాత్రం పెద్దగా స్పందించడం లేదు. టిక్కెట్లు ఇచ్చేది లోకల్ లీడర్లు కాదని, అధిష్టానం మాత్రమేనని గాలి చెబుతుండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1