పదివేల నోటు జస్ట్ మిస్

twothousand note reservebank of india

పెద్దనోట్ల రద్దుకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఐదువేలు, పదివేలు నోట్లను తెద్దామనుకుందట. కాని కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదట. కేవలం రెండువేల నోట్లను మాత్రమే తీసుకురావాలని నిర్ణయించిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ అంగీకరించింది. ఐదు, పదివేల నోట్లను తేవాలని తాము 2014లోనే కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందుకు కేంద్రం అంగీకరించలేదు. ఈ విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ స్పష్టంచేసింది. వెయ్యి, ఐదొందల నోట్లు నకిలీవి ఎక్కువగా రావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని తాము కేంద్రానికి సూచించినట్లు ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. అయితే రెండు వేల నోటును మాత్రమే తీసుకురావాని 2016 మే నెలలో తమకు కేంద్రం నుంచి సూచనలు అందినట్లు ఆర్బీఐ అధికారులు పార్లమెంటరీ కమిటీకి తెలిపారు.

60 లక్షల బ్యాంకు ఖాతాల్లో జమ
పెద్ద నోట్ల రద్దు తర్వాత నిర్దేశించిన మొత్తానికన్నా భారీగా సొమ్ము 60 లక్షల బ్యాంకు ఖాతాల్లో పడినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. వీటి విలువ మూడున్నర నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. అయితే ఏ ఏ ఖాతాల్లో ఎంత మొత్తం పడిందీ? ఏ తేదీలో పడింది? అనే లెక్కలు తీసే పనిలో పడ్డారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఒక్కొక్క ఖాతాలో నవంబరు 8వ తేదీ తర్వాత రెండు లక్షలకు మించి డిపాజిట్ అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిఘా పెడతారు. వీరందరికీ త్వరలో నోటీసులు పంపనున్నట్లు తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*