పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి?

తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించేందుకు రంగంసిద్ధమైంది. ఉపముఖ్యమంత్రిగా పళనిస్వామి వ్యవహరించనున్నారు. ఈమేరకు పళని,పన్నీర్ వర్గాలమధ్య చర్చలు కుదిరినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా పన్నీర్, పళని వర్గాల మధ్య చర్చలు ఫలవంతంకాలేదు. అయితే కేంద్రం జోక్యంతో చర్చలు విజయవంతమయ్యే విధంగా ఉన్నాయనిచెబుతున్నారు. పళనిస్వామి మాత్రం తనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే దానికి కొంత సమయం పడుతుంది. తొలుత ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దినకరన్ ను బయటకు పంపిన తర్వాతే లైన్ క్లియర్ అవుతుంది.

రేపు తుది దశకు…..

పళని, పన్నీర్ వర్గాల మధ్య చర్చలు సోమవారానికి ఒకకొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నీతిఅయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి పళనిస్వామి తిరిగి వచ్చిన తర్వాత చర్చలు షురూ అవుతాయనిచెబుతున్నారు. మరోవైపు తమిళనాడులో జరుగుతున్నరాజకీయ పరిణామాలపై శశికళ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జైలులో ఉన్న శశికళను కలిసిన కొందరు నేతలు పళనిస్వామిపై కూడా ఫిర్యాదు చేశారు. అయితే శశికళమాత్రం ఇప్పుడే తొందరపడొద్దని వారితో చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మొత్తం మీద తమిళనాడు రాజకీయాలకు రెండు రోజుల్లో ముగింపు పలికే అవకాశముందని ఇరువర్గాల నేతలు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*