పళనిస్వామికి పదవీ గండమా?

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి చిక్కులు తప్పడం లేదు. ఆయన తన పదవిని ఎలా కాపాడుకోవాలా? అన్న సతమతమవుతున్న తరుణంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బుల పంపిణీ వ్యవహారం ఆయన మెడకు చుట్టుకునేలా ఉంది. ఈరోజు మద్రాసు హైకోర్టులో దీనిపై విచారణ జరిగే అవకాశముంది. అయితే ఈకేసులో పళనిస్వామి, టీటీవీ దినకరన్ మరో నలుగురు మంత్రులపై కేసులు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే దీనిపై కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం న్యాయస్థానం ఈకేసును విచారించనుంది.

నేడు మద్రాస్ కోర్టులో విచారణ…..

ఆర్కే నగర్ఉప ఎన్నికల్లో శశికళం వర్గం దాదాపు 90 కోట్ల రూపాయలను ఓటర్లకు డబ్బులు పంపిణీచేసినట్లు తేలింది. మంత్రి విజయభాస్కరన్ ఇంట్లో జరిగిన సోదాల్లో దీనికి తగిన ఆధారాలు కూడా లభించాయి. దీంతో ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి పళనిస్వామితో సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. తమిళనాడు పోలీసులు మాత్రం తమకు ఎన్నికల కమిషన్ నుంచి ఇంకా అధికారిక సమాచారం అందలేదంటున్నారు. మరోవైపు సమాచార హక్కు చట్టం ప్రకారం కేంద్ర ఎన్నికల కమిషన్ కు న్యాయవాది వైరకన్ను దీనిపై సమాచారాన్ని అడిగారు. వైరకన్నుకు అధికారికంగానే సమాచారం అందింది. తమిళనాడు ముఖ్యమంత్రితో సహా ఆరుగురిపై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించామని కూడా కేంద్ర ఎన్నికల సంఘం వైరకన్నుకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. ఇదే విషయాన్ని ఈరోజు కోర్టుకు వైరకన్ను తెలపనున్నారు. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1