పవన్‌ ప్రతిపాదనలకు సిఎం గ్రీన్‌సిగ్నల్‌

ఏ వ్యాధికైనా సరైన కారణాలు కనిపిస్తాయని, కానీ ఉద్ధానం కిడ్నీ సమస్యకు నిశితమైన కారణాలు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి, పరిశోధన చేసినవారందరూ పలు రకాల కారణాలు చెబుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ‌్యానించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రపంచశ్రేణి కిడ్నీ వ్యాధి పరిశోధన కేంద్రాన్ని ఉద్ధానంలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కిడ్నీ సమస్యపై అంతర్జాతీయస్థాయి సదస్సును నిర్వహించి ప్రపంచశ్రేణి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని యోచిస్తున్నామని చెప్పారు. వ్యాధి నివారణ, ముందు జాగ్రత్త చర్యలతో పూర్తిగా వ్యాధి నియంత్రణ చేపట్టడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి నిధుల కొరత రానివ్వమని., సమస్య పరిష్కారానికి ఏవిధంగానూ రాజీ పడే సమస్య లేదన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం తరుఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఏవిధంగా సహకరించగలరో ప్రతిపాదనలతో రావాల్సిందిగా కోరారు. ఉద్ధానం కిడ్నీ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్‌గా తీసుకుందని., రూ. 15 కోట్ల నిధులతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సిఎం చెప్పారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధుల పరిశోధనా సంస్థ ఏర్పాటుచేస్తోందని ఏపీ ప్రభుత్వం, భారతీయ వైద్య పరిశోధనా మండలి ఈ పరిశోధన కేంద్రాన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయని చెప్పారు. ఇందుకు అయ్యే వ్యయంలో ICMR 50% భరించేందుకు ముందుకు వచ్చిందని., ఏడాదికి రూ.5 కోట్ల వంతున మూడేళ్లలో రూ.15 కోట్లను ఖర్చు చేస్తామన్నారు. ఏటా రూ. 5 కోట్ల ఖర్చు కాగల ఈ పరిశోధన కేంద్రానికి మూడేళ్లకు గాను ఒకేసారి నిధులు అందిస్తాం. ఎన్ని అవసరమైతే అన్ని ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

జీవన్ దాన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్…..

ఉద్దానం బాధితులను ఆదుకోవాలని తాను చేసిన అప్పీల్‌కు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు చెప్పారు. ఉద్ధానం సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఉద్దానం సమస్య కారణంగా అనాధలు అవుతున్న అనేకమంది చిన్నారులను దత్తత తీసుకోవడానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు. పవన్ కల్యాణ్ వినతిపై స్పందించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల పూర్తి బాగోగులను చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రాథమిక ఆరోగ్య రంగంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ చేసిన సూచనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఉద్దానం పరిసర ప్రాంతాలలో వైద్య పరమైన కోర్సులు చేసిన 900 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారిని ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కార కార్యక్రమంలో భాగస్వామ్యుల్ని చేయాలని పవన్ కల్యాణ్ సూచించడంతో . స్పందించిన సీయం. వారి వివరాలు సేకరించి ఏవిధంగా భాగస్వాముల్ని చేయాలో పరిశీలించి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న జీవన్ దాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వుండేందుకు పవన్ కల్యాణ్ అంగీకారం తెలిపారు. తొలిసారి ఏపీ రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టారు పవన్. రాజకీయాలకు అతీతంగా సమస్యలపై ఉద్యమించాలన్నారు. ఉద్దానం సమస్యపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. మనుషులు చనిపోతున్నప్పుడు వారితో రాజకీయ లబ్ది పొందుతామనడం సరికాదన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 14686 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*