పవన్ ఆకులెత్తేసే వారా?

జనసేనానిపై తెలుగు తమ్ముళ్లు , కమలనాధులు వాయిస్ పెంచేశారు. పవన్ కు రాజకీయ అనుభవం లేదన్న తెలుగు తమ్ముళ్లు ఒకింత తీవ్రంగానే మండిపడుతున్నారు. తాజాగా పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప పపన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పద్మశాలీలు పవన్ కలిశారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా జనసేన అధినేతను కోరారు. అందుకు పవన్ అంగీకరించారు. వారు ఏర్పాటు చేసే సభకు కూడా హాజరవుతానని పవన్ వారికి హామీ ఇచ్చారు. చేనేత సమస్యలపై వచ్చే నెలలో పవన్ మంగళగిరి వెళ్లనున్నారు. అక్కడి సభలో ప్రసంగించి వారికి సంఘీభావాన్ని తెలపనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీ నిమ్మల కిష్టప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్నం పెట్టే వారిని వదిలి..ఆకులెత్తేసేవారి వద్దకు వెళ్లి ప్రయోజనమేంటని? నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. పవన్ వల్ల ఏదీ సాధ్యం కాదని చెప్పేశారు. పద్మశాలీయుల అభివృద్థి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. దీంతో పవన్ ను నేరుగా టార్గెట్ చేసినట్లయింది. మరొకపక్క రాయపాటి సాంబశివరావు కూడా తన గురించి నీ అన్న చిరంజీవిని అడుగు చెబుతాడు అని ప్రశ్నించారు. ఇంకో వైపు కమలనాధులు కూడా పవన్ పై విమర్శల దాడిని పెంచారు. సాక్షాత్తూ వెంకయ్య నాయుడే పవన్ పేరును ప్రస్తావించకుండానే జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు. దక్షిణాది, ఉత్తరాది మధ్య కలతలు రేపడం సరికాదన్నారు. మొత్తం మీద టీడీపీ, బీజేపీ నేతలు పవన్ పై వరుసగా విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. మరి దీనికి సమాధానం పవన్ ట్వీట్ ద్వారా చెప్పాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*