పవన్ టార్గెట్ అదేనంటగా…?

పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పొలిటికల్ క్యారిడార్లలో సంచలనంగా మారారు. ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలియదు. ఆయనకు మూడ్ వస్తే శత్రువతోనైనా చేతులు కలుపుతారు. శత్రువును పొగిడేస్తారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో పవన్ ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆయనను పొగిడేయడంతో నేతలకు ఏమీ పాలుపోవడం లేదు. అసలు కేసీఆర్ ను ఎందుకు కలిశారన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది. సాధారణంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పవన్ కలిసేందుకు వచ్చి ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు కూడా భావించాయి.

అసలు పవన్ ఎందుకు వెళ్లారంటే….

దాదాపు గంటన్నర సేపు కేసీఆర్ రాకకోసం వెయిట్ చేసిన పవన్ ఆ తర్వాత రెండుగంటలకు పైగానే భేటీ అయ్యారు. కేసీఆర్ కూడా పవన్ కు మంచి ప్రయారిటీ ఇచ్చారు. పవన్ ను మంచిగా చూసుకోవాలని అనుచరులకు కూడా కేసీఆర్ చెప్పారట. అంటే ఇక పవన్ పై టీఆర్ఎస్ ఈగ కూడా వాలనీయదన్న మాట. అసలు పవన్ ఎందుకు ఇంత సడెన్ గా నిర్ణయం తీసుకుంటారో పక్కన ఉన్న వాళ్లకే తెలియదు. పవన్ సున్నిత మనస్కుడు. ఆరోజు ఉదయాన్నే పత్రికలు చదివిన పవన్ చలించిపోయారు. రైతులకు 24 గంటలూ ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నారని కథనాలు రావడంతో ఆయన మనసు ఊరుకోలేదు. అద్భుతమైన ఘనత సాధించిన కేసీఆర్ ను కలిసి అభినందించి రావాల్సిందేనని ఆయన ప్రగతి భవన్ కు బయలుదేరినట్లు జనసేన ముఖ్యుడొకరు వెల్లడించారు.

ఇక ప్రచారంలో ఏం చేస్తారు….

అయితే పవన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో వెలిగిపోతుంటే ఇక పార్టీ పెట్టడం ఎందుకన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. వేల సంఖ్యలో జనసైనికులను తయారు చేసుకునేందుకు సిద్ధమైన పవన్ కల్యాణ్ వారికి ఏ విధమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఇక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ ఏడాదిలో పవన్ కల్యాణ్ రెండు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంది. రెండు రాష్ట్రాల్లో ఆయన ప్రతిపక్షాల మీద విమర్ళలు చేయాలే తప్ప అధికార పార్టీపై చేయలని పరిస్థితిని ఆయనకే ఆయనే తెచ్చుకున్నారు.

నిలకడలేని తనమా….?

రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ను తెలంగాణలో మరోసారి దెబ్బకొట్టడానికే పవన్ ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర విభజనకు పూర్తిగా వ్యతిరేకం. విభజన సహేతుకంగా చేయాలని ఆయన తొలినుంచి వాదిస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ వాడిన భాషను కూడా ఆయన తప్పుపట్టారు. అలాంటి పవన్ కల్యాణ్ కాంగ్రెస్ ను మైనస్ లోకి నెట్టాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ను పొగిడేసినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రైతు ఆత్మహత్యలు పవన్ కు కన్పించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీని వదిలేసి… ప్రతిపక్ష వైసీపీ పై విమర్శలు చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. కోదండరామ్ లాంటి వ్యక్తులు కూడా పవన్ నిలకడ లేని వ్యక్తి అని కామెంట్ చేయడం ఇందుకు నిదర్శనం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*