పవన్ ఫుల్ హ్యాపీ….?

జనసేన అధినేత పిలుపుకు అపూర్వ స్పందన కన్పిస్తోంది. గత నాలుగు రోజల నుంచి ఉత్తరాంధ్రలో జనసైనికుల ఎంపిక జరుగుతోంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి జనసైనికులుగా చేరేందుకు ఆరువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. స్క్రిప్ట్ రైటర్స్, స్పీకర్స్, కంటెంట్ రైటర్స్ గా ఈ ఎంపికను నిర్వహిస్తున్నారు. మిగిలిన పార్టీలకు భిన్నంగా యువతను పార్టీలో భాగస్వామ్యులను చేయడానికి జనసేన అధినేత పవన్ ప్రారంభించిన ఈ విన్నూత్న కార్యక్రమం సక్సెస్ అయినట్లే కన్పిస్తోంది. ముఖ్యంగా యువతీ, యువకులు జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో గత నాలుగురోజులుగా జనసైనికుల ఎంపిక జరుగుతోంది. దీనికి అనూహ్య స్పందన లభిస్తుందని జనసేన పార్టీ మీడియా ఇన్ ఛార్జి హరిప్రసాద్ తెలుగు పోస్ట్ కు చెప్పారు. ఎక్కువగా యువతను భాగస్వామ్యులను చేయాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన అన్నారు. అంతేకాదు సమస్యలను పరిష్కరించడంలోనూ, నీతి నిజాయితీగా ప్రజాసేవ చేయడంలో యువత ప్రధాన పాత్ర పోషించనున్నారు.

రెస్సాన్స్ అదుర్స్….

వైసీపీ, కాంగ్రెస్, టీడీపీలు సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుడితే జనసేన మాత్రం ఆ జోలికి పోలేదు. సభ్యత్వ కార్యక్రమం తమకు అవసరం లేదనుకుంది. వందలాది మంది సుశిక్షితులైన కార్యకర్తలు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటే తమకు లాభదాయకమని గుర్తించింది. స్వలాభం చూసుకోకుండా సేవాభావం ఉన్నవారినే జనసైనికులుగా ఎంపిక చేస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారందరినీ పార్టీలో ఏదో రకంగా ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. దీంతోపాటు వీరితో ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ సమావేశం అవుతుండటం కూడా ఎక్కువ మంది యువత క్యూ కడుతున్నారు. జనసేన అధినేత కూడా యువత నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే తరహాలో మిగిలిన జిల్లాల్లోనూ జనసైనికుల ఎంపికను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఏపీలో నాలుగు జిల్లాల ఎంపిక ప్రక్రియ పూర్తి కావచ్చింది. మొత్తం మీద పవన్ కల్యాణ్ కొత్త ఆలోచన సక్సెస్ అయ్యేటట్లే కన్పిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*