పీకే టీం మారబోతోందోచ్…!

వైసీపీ అధ్యక్షుడు జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా సొంత పార్టీ నేతల నుంచి పీకే టీం పై ఎక్కువగా ఫిర్యాదులందడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. పీకే టీం ఇప్పటికే 175 శానసనభ నియోజకవర్గాల్లో సర్వేను పూర్తి చేసింది. పార్టీ ఇన్ ఛార్జులు, సమన్వయకర్తల గురించి ఆరాతీసింది. గత మూడున్నరేళ్లుగా ఆ పార్టీ నేతలు నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజల్లో వారికున్న పలుకుబడి, ఓట్లర్ల మనస్సుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం పీకే టీం తెలుసుకుంటోంది.

వీరంతా హాయ్ ‘‘బ్రో’’ బ్యాచ్….

అయితే పీకే టీంలో సభ్యులు ఎక్కువగా ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వీరికి తెలుగు భాష రాదు. ఇంగ్లీషు, హిందీల్లోనే సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల జగన్ పాదయాత్ర పూర్తి చేసిన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పీకే టీం ఇచ్చిన నివేదికలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ఈ జిల్లాల్లో తన సమాచారానికి, పీకే టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు పొంతన లేకుండా ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇదెలా జరుగుతుందన్న పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు.

పీపుల్స్ పల్స్ తెలుసుకోలేక….

అయితే వీరికి తెలుగు భాష రాకపోవడంతో పీపుల్స్ పల్స్ తెలుసుకోలేకపోతున్నారని కొందరు సీనియర్ నేతలు చెప్పారు. రాయలసీమలోని గ్రామాల్లో పీకే టీం వేసిన ప్రశ్నలకు వారేం సమాధానం చెప్పారో….వీరేం రాసుకొచ్చారో? అన్న అనుమానం వైసీపీ ముఖ్యనేతల్లో బయలుదేరింది. దీనిపై స్థానిక నేతలను ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులు కేవలం పీకే రాసిచ్చిన ప్రశ్నలను ఫిల్ చేసుకుంటూ వెళుతున్నారని, ఎక్కువగా ఇంగ్లీషు, హిందీల్లోనే మాట్లాడుతున్నారని చెప్పడంతో వెంటనే జగన్ కు ఈ విషయం తెలిపారు.

లోకల్ బాయ్స్ కోసం….

దీంతో టీంలో స్థానికులను నియమించుకోవాలని ప్రశాంత్ కిషోర్ కు జగన్ సూచించారట. లోకల్ బాయ్స్ దొరుకుతారని, యూనివర్సిటీ, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ను ఎంగేజ్ చేసుకోవచ్చని కూడా జగన్ చెప్పారు. అయితే వైసీపీ సర్వే నిర్వహిస్తున్నట్లు వారికి తెలియకుండా ఒక సంస్థ ద్వారా వెళ్లాలని గట్టిగా చెప్పడంతో ఇప్పుడు పీకే తన టీంను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆంధ్ర, నాగార్జున, వెంకటేశ్వర యూనివర్సిటీల నుంచి విద్యార్థులను తన టీంలో చేర్చుకునేందుకు పీకే రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద పీకే టీం ఇన్నాళ్లూ చేసిన సర్వే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పాదయాత్ర తర్వాత అసలు విషయం బయటపడింది. దీంతో పీకే ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులను హైదరాబాద్ లో తన కార్యాలయంలో వాడుకునేందుకు సిద్ధమయ్యారు. మొత్తం పీకే టీం మారబోతోందన్నమాట.

1 Comment on పీకే టీం మారబోతోందోచ్…!

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1