పీకే ఫ్యాన్స్ ఇక పండగ చేసుకోండి

chiranjeevi janasena party

సామాజిక సేవలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడని అంతర్జాతీయ అవార్డు ప్రకటించింది లండన్ సంస్థ . ఉద్దానం లో కిడ్నీ బాధితుల కోసం , చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ చూపిన చొరవ చేస్తున్న సేవను పరిగణలోనికి తీసుకుని ఆయనకు ఇండో యూరోపియన్ ఫోరమ్ ఈ అవార్డు కి ఎంపిక చేసింది. నవంబర్ 17 న లండన్ రావాలని ఐఈబిఎఫ్ ఈ మేరకు పవన్ కి ఆహ్వానం పంపింది. హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరిగే కార్యక్రమంలో పవన్ కి అవార్డు అందజేయనున్నారు. ఈ వివరాలను జనసేన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసింది.

17న అవార్డు ప్రదానం……

“ఇన్వెస్ట్‌ ఇన్‌ న్యూ ఇండియా” పేరుతో లండన్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును పవన్‌కు అందచేస్తారని జనసేన మీడియా విభాగం ప్రకటించింది. ఐఈబిఎఫ్‌ భారత సమన్వయకర్త చంద్రశేఖర్‌ ఆకుల., భారత విభాగ లీడర్‌ సునీల్ కుమార్‌ గుప్తాలు పవన్‌కు ఆహ్వానాన్ని అందచేశారు. ఐఈబిఎఫ్‌ ఏటా గ్లోబల్‌ బిజినెస్‌ మీట్‌ సందర్భ:గా వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఎక్సలెన్స్‌ పురస్కారాలు అందిస్తోంది. ఉద్దానం కిడ్నీ బాధితుల్ని ఆదుకునేందుకు పవన్‌ చూపిన చొరవ., చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు చేసిన కృషి., సామాజిక సమస్యల పరిష్కరంలో పవన్‌ చేస్తోన్న కృషికి గాను అవార్డు అందిస్తున్నట్లు ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*