పైరసీకి బాహుబలి బలైందా…?

రికార్డు స్థాయి కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న బాహుబలి చిత్రానికి పైరసీ పోటు తప్పలేదు. చిత్రం విడుదలై నాలుగు రోజులు గడవక ముందే బెజవాడ మార్కెట్లోకి పైరసీ సీడీలు వచ్చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో విడుదలైన బాహుబలి కలెక్షన్లు నాలుగోరోజుకు రూ.383కోట్లు దాటేశాయని కరణ్‌జోహర్‌ ట్వీట్‌ చేశారు. వెయ్యి కోట్ల మార్కెట్‌ను సునాయసంగా దాటేస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్న తరుణంలో పైరసీ నిర్మాతల ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది.

బెజవాడలో పైరసీ….

విజయవాడలో భారీ ఎత్తున డీవీడీలు వీడియో పార్లర్లలో దర్శనమిస్తున్నాయనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సినిమాను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పైరసీ ప్రింట్లు మార్కెట్లోకి ఐదో రోజే వచ్చేయడంతో పోలీసులు ఖంగుతిన్నారు తమిళనాడు నుంచి తమకు పైరసీ మాస్టర్‌ కాపీలు అందాయని వీడియో పార్లర్ యజమానులు పోలీసులకు చెప్పారు. దాడుల సమాచారం బయటకు పొక్కడంతో చాలా చోట్ల దుకాణాలు మూసివేశారు. బీసెంట్‌రోడ్‌., గవర్నర్‌ పేట ప్రాంతాల్లోని దుకాణాల్లో పైరసీ డీవీడీలను గుర్తించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*