పొలిటికల్ లీడర్స్ అదిరిపడేలా ఈసీ నిర్ణయం

ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వ్యయం మితి మీరి చేస్తున్న వారికి గట్టి వార్నింగ్ ఇచ్చేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరోగ్యశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రాపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఆయనపై మూడేళ్ల పాటు అనర్హతను విధిస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. అఫడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకే తాము అనర్హత వేటు వేశామని ఎన్నికల సంఘం పేర్కొంది.

మంత్రిపై మూడేళ్ల అనర్హత వేటు….

మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రాప్రభుత్వంలో నెంబర్ టూ గా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశాఖతో పాటు ప్రజా సంబంధాల శాఖను కూడాచూస్తున్న నరోత్తమ్ మిశ్రాపై వేటు పడటంతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా పొలిటికల్ లీడర్స్ వెన్నులో వణుకు మొదలయింది. నరోత్తమ్ మిశ్రా ఎన్నికల వ్యయాన్ని సక్రమంగా ఎన్నికల కమిషన్ కు సమర్పించలేదు. నరోత్తమ్ మిశ్రా ఎన్నికల వ్యయంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల వ్యయాన్ని అధికంగా పెట్టి చెల్లింపు వార్తల వివరాలను అఫడవిట్ లో చూపలేదని 2012లో రాజేంద్ర భరత్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఎన్నికల కమిషన్ విచారణను నిలిపివేయాలంటూ నరోత్తమ్ మిశ్రా హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. దీంతో అఫడవిట్ సక్రమమైన వివరాలను పొందుపర్చలేదని ఎన్నికల కమిషన్ నరోత్తమ్ మిశ్రా  పై అనర్హత వేటు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*