పోలిక వస్తుందనే జనసేనాని రూట్ మార్చారా …?

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చలోరే చల్ అంటూ యాత్ర ప్రారంభించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి ఆరంభించడానికి పలు కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. ఒక పక్క వైసిపి అధినేత జగన్ రెండు నెలలకు పైబడి ప్రజా సంకల్ప యాత్ర తో ప్రజలతో మమేకం అయ్యారు. ఆయన యాత్రకు ప్రజలు ఏపీలో బ్రహ్మరధం పడుతున్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల పర్యటనల్లో జగన్ పాదయాత్ర పట్ల ఆ పార్టీ శ్రేణులు హుషారుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గత నవంబర్ లోనే జగన్ యాత్ర ప్రారంభం కాగానే తమపార్టీ తరపున మరో యాత్ర ప్రకటిస్తారని జనసేన వర్గాలు ఆయన అభిమానులు ఎదురు చూశారు. కానీ అజ్ఞాతవాసి చిత్రం నిర్మాణంతో ఆయన జనవరి ఆఖరి వారం కానీ ఫిబ్రవరి నుంచి కానీ ప్రజల్లోకి వెళతారని పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డ్ లో చెప్పినట్లే పికె తన యాత్ర కోసం ఒక ప్రకటన చేసేసారు.

సెంటిమెంట్ కోసమేనా ….?

యాత్ర తెలంగాణలోని ఆంజనేయ స్వామి ఆలయం కొండగట్టు ప్రాంతం నుంచి ప్రారంభిస్తా అన్నారు పవన్. 2014 ఎన్నికల్లో అక్కడే తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని తనకు పునర్జన్మ లభించిన తమ ఇంటి ఇలవేల్పు ఆంజనేయుడి ఆశీస్సులతో ప్రజా ఆశీస్సులు కొరతా అంటూ ట్వీట్ చేశారు. వైసిపి అధినేత జగన్ పాదయాత్రకు ముందు తిరుమల వెంకన్న ఆశీస్సులతో బయల్దేరారు. ఇప్పడు పవన్ అదే సెంటిమెంట్ బాటలో వస్తున్నారు. జనసేనాని తెలంగాణ లో పర్యటించడానికి రెండు యాత్రలపై ఏపీలో పోలికలు టీవీల్లో చర్చలు సాగడం ఇష్టం లేకే అని పలువురు భావిస్తున్నారు. ఎవరి యాత్ర ఎలా ఉందన్న లెక్కలు ప్రభుత్వాలపై చేసే విమర్శలు, ఆరోపణలు అన్ని ప్రజల చర్చల్లో లెక్కల్లోకి వస్తాయి. టిడిపి పై పవన్ సానుకూల వైఖరి తో వుంటూ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారని రాజకీయ వర్గాల అంచనా.

టిడిపికి నష్ట నివారణకు …

ఈ తరుణంలో జనంలో ఇప్పుడు యాత్ర చేస్తే పబ్లిక్ నుంచి సమస్యల రూపంలో నెగెటివ్ మాట్లాడక పరిస్థితి పికెకి వస్తుంది. దీనిపై ఎలా స్పందించినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏపీ లో బాబు సర్కార్ ను మైనస్ చేస్తుంది. దాంతో బాటు మీడియా పాజిటివ్ కన్నా నెగిటివ్ వార్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో జనసేనాని ఏపీ యాత్ర కర్ర విరగకుండా పాము చావకుండా నడవాలంటే సాధ్యం కాదు. పవన్ కొంత కాలం క్రితం ఏపీలో జరిపిన కార్యకర్తల సమావేశాలు విజయవంతం అయినా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు జనసేనకు రాజకీయాల్లో ఎలాంటి స్ఫష్టత లేవనే సంకేతాలు ప్రజల్లోకి పంపాయి. దానికి తోడు రాబోయే ఎన్నికల్లో టిడిపి తో జనసేన కలిసే ప్రయాణిస్తుంది అని తేల్చేశారు విశ్లేషకులు. ఇలాంటి పరిణామాలు ఇప్పటినుంచి ఏపీలో ఎదుర్కోవడం ఇష్టం లేకే పవన్ తన యాత్ర తెలంగాణ నుంచి ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నారని అంటున్నారు కొందరు. గతంలో పవన్ యాత్ర ఆయన పోటీ చేస్తారని చెబుతున్న రాయలసీమ లోని అనంతపురం జిల్లా నుంచి ఉంటుందని అనుకున్నారు. కానీ అందరి ఊహా గానాలకు తెరదించుతూ పికె యాత్ర తెలంగాణ నుంచి ఆరంభం అని తేలడం పెద్ద చర్చకి. దారి తీసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*