ప్రజాకర్షక బడ్జెట్ కోసం కసరత్తులు

తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని రెడీ అవుతుంది. 2017-18 బడ్జెట్ లో పూర్తిగా సంక్షేమ రంగాలకు అధిక కేటాయింపులు చేయాలన్న లక్ష్యంతో బడ్జెట్ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ బడ్జెట్ సుమారు లక్షా అరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ లో ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించనున్నారు.

నోట్ల రద్దుతో దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది. అయినా ఈ ప్రభావం భవిష్యత్తులో ఉండదంటున్నారు. ఈ బడ్జెట్ లో సాగునీటి రంగానికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వనుంది. గత సంప్రదాయాలకు భిన్నంగా ఈ సారి బడ్జెట్ లో ప్రణాళిక, ప్రణాళికేతర రంగాలను కలిపి బడ్జెట్ కు రూపకల్పన చేయనున్నారు. ప్రజాకర్షక బడ్జెట్ ను రూపొందించాలని ఇప్పటికే కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. సంబంధిత మంత్రులకూ సీఎం చెప్పడంతో ఆర్థిక శాఖ అధికారులు ప్రజాకర్షక బడ్జెట్ ను రూపొందిస్తున్నారు రెవెన్యురాబడి, వ్యయం, వృద్ధిరేటు లను అంచనాగా బడ్జెట్ ను తయారు చేసే పనిలో పడ్డారు అధికారులు. పక్కా గృహాలకు కూడా ఈ బడ్జెట్ లో పెద్దపీట వేయనున్నారు. బలహీన వర్గాలకు కల్యాణ లక్ష్మి, ముస్లింలకు షాదీ ముబారక్ పథకాల నగదును పెంచనున్నారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ అన్ని వర్గాలను లక్ష్యంగానే చేసుకుని  ప్రజాకర్షక బడ్జెట్ ను రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలుగు పోస్ట్ ప్రతినిధికి తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*