ప్రభుత్వాలను ఆడిస్తున్న జగ్గీ వాసుదేవ్

ఆయన ఒక బాబానే … కానీ ఆయన చెప్పింది ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు తలాడిస్తూ చేయాలిసిందే . ఆయనే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ . ప్రస్తుతం ఈషా ఫౌండేషన్ చేపట్టిన నదుల అనుసంధానం , సేవ్ రివర్స్ కాన్సెప్ట్ ను ప్రభుత్వాలు అద్భుతంగా ప్రమోట్ చేస్తూ జై జగ్గీ వాసుదేవ్ … జై జై అంటున్నాయి. ఒక సంస్థ కు చెందిన ఆధ్యాత్మిక ప్రవచన కర్త కు ఇంత హైప్ క్రియేట్ చేయడానికి కారణాలు ఏమిటి అంటే మాత్రం ఎవరు దీనికి సమాధానం చెప్పలేని స్థితి . ఈషా ఫౌండేషన్ లాంటి సంస్థలు అనేకం ఇంతకన్నా అద్భుత కాన్సెప్ట్ లను ప్రభుత్వాలు ముందు పెట్టినా పట్టించుకున్న వారే లేరు . అనేక పర్యావరణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇదే అంశాన్ని పదే పదే చెప్పినా చూసి చూడనట్లే ప్రభుత్వాలు పోయేవి . కానీ ఈషా ఫౌండేషన్ పిలుపు ఇవ్వడం ప్రధాని సహా ముఖ్యమంత్రులు జై కొట్టడం కార్పొరేట్ ప్రమోషన్ కోసమే అన్న విమర్శలు సర్వాత్రా వినిపిస్తున్నాయి .

అటవీ నిబంధలు ఎందుకు ఉల్లంఘించారు ….?

ఈషా అధినేత జగ్గీ వాసుదేవ్ చేపట్టిన కార్యక్రమం చాలా మంచిదే . దేశంలోని నదులన్నీ కాలుష్య విషం జల్లుతున్నాయి . పాలకులు ఏనాడు వీటి అతీగతీ పట్టించుకున్న పాపానికి పోలేదు. కళ్ళు మూసుకున్న ప్రభుత్వాలకు దారి చూపించిన జగ్గీ వాసుదేవ్ నిజాయితీ పై మచ్చలు వున్నాయి . ఆయన కోయంబత్తూరు ఆశ్రమంలో ఆదివాసీ , అటవీ నిబంధనలు ఉల్లంఘించి దట్టమైన అరణ్యంలో శాశ్వత కట్టడాలు నిర్మించేశారు . ప్రధాని మోడీ ని సైతం తీసుకువచ్చి తాను చేపట్టిన ఈ అక్రమ కట్టడాలను సక్రమం చేసుకున్నారన్న విమర్శలు వున్నాయి . అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ లో భాగమే . మరి ఆయన ఆ చట్టాలు ఉల్లంఘించి నీతులు చెబుతూ దేశ రాష్ట్రాధినేతలు తో సాగిస్తున్న ప్రచారం అనుమానించ తగ్గదే అన్నది విశ్లేషకుల వాదన .

Ravi Batchali
About Ravi Batchali 15660 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*